ETV Bharat / city

విజయవాడ యువతి హత్య కేసు: నిందితుడికి ఈ నెల 20 వరకు రిమాండ్​

విజయవాడ బీటెక్ యువతి హత్యకేసులో నిందితుడు నాగేంద్రని కోర్టులో హాజరుపరిచారు. అతనిపై సెక్షన్ 3, సబ్ క్లాస్ 2, సబ్ క్లాస్ 5 ఎస్సీ ఎస్టీ, ఐపీసీ 302, 449 కింద కేసులు నమోదు చేశారు.

Vijayawada woman murder case
నిందితున్ని కోర్టులో హాజరు పరచనున్న పోలీసులు
author img

By

Published : Nov 7, 2020, 12:18 PM IST

Updated : Nov 7, 2020, 7:54 PM IST

విజయవాడ క్రీస్తు రాజపురంలో గతనెల 15వ తేదీన పట్టపగలు ఇంజనీరింగ్‌ విద్యార్ధిని గొంతుకోసి హత్య చేసిన కేసులో నిందితుడు నాగేంద్రబాబుకు ఈనెల 20 వరకు రిమాండ్‌ విధించారు. గతనెల 15వ తేదీన విద్యార్ధిని హత్య అనంతరం తీవ్రగాయాలతో ఉన్న నాగేంద్రబాబును చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యం అనంతరం నాగేంద్రబాబును నిన్న పోలీసులు అరెస్టు చేశారు. న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచే ముందు ఈఎస్ఐ ఆసుపత్రిలో బీపీ, షుగర్, ఈసీజీ తదితర వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం విజయవాడలోని ఒకటో మెట్రోపాలిటిన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో హాజరుపరిచారు.

న్యాయమూర్తి యస్.కమలాకర్ రెడ్డి నాగేంద్రకు 14 రోజుల రిమాండ్ విధించారు. మచిలీపట్నంలోని జిల్లా జైలులో కరోనా పరీక్షలు నిర్వహించి అనంతరం రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలించాలని ఆదేశించారు. నాగేంద్ర తనకు ఉన్న గాయాల గురించి న్యాయమూర్తికి, వైదులకు తెలిపారు. ఐదు రోజులకు ఓసారి తనిఖీ చేయించుకోవాలని గుంటూరు వైద్యులు సూచించినట్లు తెలిపారు. ఈ విషయాలను పోలీసులు తమ నివేదికలో పొందుపరిచారని న్యాయమూర్తి అన్నారు. తేజస్విని హత్యోదంతం కేసును దర్యాప్తు చేస్తోన్న దిశా పోలీసులు... సమగ్ర విచారణ కోసం వారం రోజుల కస్టడీకి కోరేందుకు దరఖాస్తు చేసుకున్నారు.

హత్యకు గల అసలు కారణాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. నాగేంద్ర ప్రస్తావించిన ఆరుగురు స్నేహితులను పోలీసులు ప్రశ్నించనున్నారు. ఇప్పటికే ఈ హత్య కేసులో పోలీసులు 45 మంది సాక్షుల నుంచి వివరాలు సేకరించారు. పోలీసు కస్టడీకి న్యాయస్థానం అనుమతించిన తర్వాత నాగేంద్రను ప్రశ్నించి.. ఛార్జిషీటు దాఖలు చేయాలని భావిస్తున్నారు.

ఇదీ చదవండి: రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం

Last Updated : Nov 7, 2020, 7:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.