విజయవాడ తెదేపా మేయర్ అభ్యర్థి కేశినేని శ్వేత మూడో డివిజన్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. డివిజన్లను రీ - డ్రాయింగ్ చేయడం వల్ల ఓటర్లు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఒకే ఇంటిలో ఉన్న వారి ఓట్లు.. వేర్వేరు పోలింగ్ స్టేషన్లల్లో వేశారని అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ ఇంట్లో తన ఓటు ఒక చోట, తల్లిదండ్రులవి వేర్వేరు చోట్ల ఉన్నాయని చెప్పారు. తమ అభ్యర్ధులను.. వైకాపా ఏజెంట్లు, ఎన్నికల సిబ్బంది ఇబ్బంది పెడుతున్నారని ఆరోపణలు చేశారు.
ఇదీ చదవండి: