విజయవాడ పాయకాపురం ప్రశాంతీనగర్లో నాగేంద్రస్వామి ఆలయ గోశాలను చెరువు ఆక్రమణలు తొలగించే పనిలో భాగంలో తీసివేశారు. ముందస్తుగా సమాచారం ఇవ్వకుండా, గోవులకు ప్రత్యామ్నాయ ఆవాసం చూపకుండా గోశాలను తొలగించవద్దని స్థానికులు, ఆలయ నిర్వాహకులు ఆందోళన చేపట్టారు.
నలభై ఏళ్లుగా ఈ ఆలయం ఉంది. ఇన్ని సంవత్సరాలు..ఏ ప్రభుత్వానికి అడ్డురాని దేవాలయం, గోశాల... ఈ ఏడాదే అడ్డువచ్చాయా..?. గోశాలలో 20 పశువులు ఉన్నాయి. ఉన్నట్లుండి తొలగించండి అంటే వాటిని ఎక్కడకు తీసుకెళ్లాలి. మనుషులకు అద్దెకు ఇళ్లు ఇస్తారు. పశువులు ఎలా..?. -గోశాల నిర్వాహకులు
నలభై ఏళ్లుగా గోశాల, నాగేంద్ర స్వామి పుట్ట ఉండగా తొలగించటమేమిటని ప్రశాంతీనగర్ వాసులు అధికారులని నిలదీశారు. గుడి గోడను జేసీబీతో తొలగించి, రేపు మొత్తం పగలకొడతామని అధికారులు చెప్పారు. గోశాల, నాగేంద్రస్వామి పుట్ట తొలగింపును అడ్డుకుంటామని ఆలయ నిర్వాహకులు, స్థానికులు అధికారులకు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి : నిత్యావసరమే.. అత్యవసరంగా పొదుపుచేయాల్సిందే..