ETV Bharat / city

'ప్రతి రోజూ పదివేల మంది భక్తులకు అనుమతి' - నవరాత్రి ఉత్సవాలపై దుర్గ గుడి సమావేశం న్యూస్

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రి మహోత్సవాల్లో లక్షన్నర రూపాయలు చెల్లించిన దాత పేరిట ఒకరోజున పూల అలంకరణ జరిపించాలని దేవస్థానం నిర్ణయించింది. ఆలయంలోని మహామండపంలో దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎంవీ సురేశ్ బాబు అధ్యక్షతన... ఆలయంలోని అన్ని విభాగాల అధికారులతో దసరా ఉత్సవ ఏర్పాట్లపై ప్రత్యేక సమావేశం జరిగింది.

vijayawada kanakadurga temple ready for navaratri utsav

author img

By

Published : Sep 29, 2020, 9:50 PM IST

కొవిడ్-19 నియంత్రణా చర్యలు పాటిస్తూ దసరా నవరాత్రుల్లో అమ్మవారి దర్శనానికి ప్రతిరోజూ పది వేల మంది భక్తుల్ని మాత్రమే అనుమతిస్తామని ఎంవీ సురేశ్ బాబు తెలిపారు. దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడు ముందుగా టైం స్లాటు ప్రకారం ఆన్​లైన్​లో టిక్కెట్లు పొందాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం భక్తులు, సిబ్బంది భద్రత దృష్ట్యా అన్ని ప్రత్యేక పూజలు పరోక్షంగా మాత్రమే నిర్వహిస్తామని... పరోక్ష పూజ టికెట్లు అన్ని ఆన్​లైన్​లో అందుబాటులో ఉంచామని చెప్పారు.

అక్టోబరు 15 నుంచి ప్రతి 3 రోజులకు ఒకసారి దేవస్థానంలోని అన్ని విభాగాల సిబ్బందికి కరోనా రాపిడ్ టెస్టు నిర్వహిస్తామని సురేశ్ బాబు తెలిపారు. ప్రతి సంవత్సరం దసరా ఉత్సవాల సమయంలో నిర్వహించే నగరోత్సవ కార్యక్రమం ఈ ఏడాది ఆలయ ఆవరణలో మాత్రమే నిర్వహిస్తామని చెప్పారు. దసరా మహోత్సవాల్లో ప్రసాదం పంపిణీ, వేదసభ నిర్వహణ, సుహాసినీ పూజ, కుమారిపూజ, డెప్యుటేషన్ సిబ్బందికి విధులు కేటాయింపు... భక్తులకు వసతి తదితర అంశాలపై చర్చించారు.

ఈ సమావేశంలో ఆలయ స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద శర్మ, వైదిక కమిటీ సభ్యులు ఆర్.శ్రీనివాస శాస్త్రి , షణ్ముఖశాస్త్రి, ఇంజినీరు డి.వి.భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

కదులుతున్న కంటైనర్లే టార్గెట్.. రెక్కీ చేస్తే పనైపోయినట్టే!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.