మెగా డీఎస్సీ నిర్వహించి ప్రభుత్వ శాఖల్లోని పోస్టులను వెంటనే భర్తీ చేయాలని జనసేన పార్టీ అధికార ప్రతినిధి పోతిన మహేష్.. ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జాబ్ క్యాలెండర్‌కు వ్యతిరేకంగా నిరుద్యోగులతో కలిసి విజయవాడలో ఆందోళను దిగారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జాబ్ లెస్ క్యాలెండర్ ఎంతో ఆర్భాటంగా ప్రకటించి లక్షల మంది నిరుద్యోగులను మోసం చేశారన్నారు. ఎన్నికలకు ముందు 'నేను విన్నాను నేను ఉన్నాను' అని చెప్పిన జగన్ ఇప్పుడు ప్యాలెస్ వీడకుండట్లేదని విమర్శించారు. ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ చేసే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
అనంతపురంలో..
నిరుద్యోగుల జీవితాలను విచ్ఛిన్నం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని విద్యార్థి యువజన నిరుద్యోగ సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. అనంతపురంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఉరితాళ్లు వేసుకుని వినూత్నంగా నిరసన తెలిపారు. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఈ నెల 8 న జిల్లా పర్యటనకు వస్తున్న ముఖ్యమంత్రి జగన్ పర్యటన అడ్డుకుంటామన్నారు. అవసరమైతే ఈ నెల 19న సీఎం కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: