విజయవాడ పటమటలో సంచలనం సృష్టించిన గ్యాంగ్‌వార్‌లో మరణించిన తోట సందీప్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది. మృతదేహం తరలింపులో పోలీసులు, కుటుంబసభ్యుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవటంతో తర్జనభర్జన నెలకొంది. ఇంటి వద్ద తల్లి కదలలేని పరిస్థితిలో ఉందని, చివరిచూపు కోసం ఇంటికి అనుమతించాల్సిందిగా కుటుంబసభ్యులు విజ్ఞప్తి చేశారు.
అయితే వాళ్లున్న ప్రాంతం రెడ్‌జోన్‌లో ఉందనే కారణంతో నేరుగా స్వర్గపురికే మృతదేహం తరలించారు. దాన్ని చూసేందుకు తరలివస్తున్న యువకులను పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు పరస్పరం దాడి చేసుకున్న రెండు గ్యాంగ్ సభ్యుల కోసం 7 పోలీసు బృందాలతో వెతుకులాట కొనసాగుతోంది.
ఇదీ చదవండి