విజయవాడ వన్ టౌన్ ఏక్తా మంచ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నగర శివారు కొత్తూరు తాడేపల్లి గోసంరక్షణ కేంద్రంలో నాలుగు టన్నుల పుచ్చకాయలను, పశుగ్రాసాన్ని వితరణ చేశారు. నిత్యం వ్యాపారాలతో బిజీ బిజీగా ఉండే జైన్ సామాజిక వర్గానికి చెందిన 50 మంది కలిసి జైన్ ఏక్తా మంచ్ పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థను నెలకొల్పి వన్య ప్రాణులకు ఆహారాన్ని అందించేలా కార్యచరణ రూపొందిచుకున్నారు. వేసవికాలంలో పావురాలు, ఆవులకు ఆహారాన్ని, నీటిని అందించే కార్యక్రమం చేపడుతున్నామని నిర్వాహకులు తెలిపారు.
ఇవీ చూడండి-కర్కష హృదయం... అమ్మకానికి పేగుబంధం!