ETV Bharat / city

CP Special Focus On Blade Batch : బ్లేడ్ బ్యాచ్ కు అడ్డాగా బెజవాడ...సీపీ ప్రత్యేక దృష్టి...

CP Special Focus On Blade Batch : బెజవాడ వాసులను వణికిస్తున్న బ్లేడ్‌ బ్యాచ్‌ ప్రవర్తనలో మార్పులు తెచ్చే దిశగా పోలిసులు కార్యాచరణ చేపట్టారు. వారి ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేశారు. సమస్యను మూలాల నుంచి పరిష్కరించేందుకు కొత్త కసరత్తు ప్రారంభించారు. నేర ప్రవృత్తి ఉన్న వారిలో మార్పు తీసుకురావడంతో పాటుగా వారిని... సమాజానికి దగ్గర చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు విజయవాడ పోలీసులు.

CP Special Focus On Blade Batch
బ్లేడ్ బ్యాచ్ కు అడ్డాగా బెజవాడ...నేరాలపై సీపీ ప్రత్యేక దృష్టి...
author img

By

Published : Jan 22, 2022, 9:45 AM IST

CP Special Focus On Blade Batch : నేరాలను నియంత్రించేందుకు విజయవాడ పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. నగర వాసులను వణికిస్తున్న బ్లేడ్‌ బ్యాచ్‌ ప్రవర్తనలో మార్పులు తెచ్చే దిశగా చర్యలు చేపట్టారు. వారి ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేశారు. సమస్యను మూలాల నుంచి పరిష్కరించేందుకు కొత్త కసరత్తు ప్రారంభించారు. నేర ప్రవృత్తి ఉన్న వారిలో మార్పు తీసుకురావడంతో పాటుగా వారిని... సమాజానికి దగ్గర చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు విజయవాడ పోలీసులు.

విజయవాడ బ్లేడ్ బ్యాచ్ కు అడ్డాగా మారుతోంది. వీరి ఆగడాలు మితిమీరుతుండటంతో కొన్ని ప్రాంతాల్లో నగరవాసులు ఇంటి నుంచి బయటకు రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. వీరిని నగర బహిష్కరించినా, మళ్లీ కొన్నాళ్లకు షరా మామూలే. గంజాయి మత్తులో బ్లేడ్‌బ్యాచ్‌ చేసే ఆగడాలకు అంతే లేకుండా పోతోంది. దారిదోపిడీలు, దౌర్జన్యం, అడిగిన వారిపై విచక్షణారహితంగా దాడి చేయడం పరిపాటిగా మారింది. వీరి నేరాలను అరికట్టేందుకు, విజయవాడ పోలీసులు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశారు.

ఇదీ చదవండి : Thieves robbing in locked houses: పగలు రెక్కీ.. రాత్రిళ్లు దోపిడీలు.. తాళం వేసిన ఇళ్లే లక్ష్యం!

వివిధ కారణాలతో మత్తు పదర్థాలు, చెడు వ్యసనాలకు అలవాటు పడిన వారు.. బ్లేడ్‌ బ్యాచ్‌ సభ్యులుగా మారుతున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకుంటే తమని తామే తీవ్రంగా గాయపర్చుకుంటారు. చివరకు గొంతు కూడా కోసుకుంటారు. పోలీసులు ఈ అంశాన్ని శాంతి, భద్రతల అంశంగానే పరిగణిస్తుండడంతో.. దీనికి సరైన పరిష్కారం దొరకడం లేదు. దీనిపై ప్రత్యేకంగా దృష్టిసారించిన నగర పోలీసులు...మూలాల నుంచి నరుక్కురావాలని నిర్ణయించారు. ఈ సమస్యని సామాజిక కోణంలో చూసి వారి చెడు అలవాట్లను మాన్పించి, ఉపాధి కల్పించే దిశగా ఇకపై ముందడుగు వేయనున్నారు.

" గత నెలరోజులుగా బ్లేడు బ్యాచ్ గా పిలవబడే వారందరి జాబితా సిద్ధం చేశాం. వారిని, వారి కుటుంబ సభ్యుల్ని పోలీస్ స్టేషన్ కు పిలిపించి కౌన్సిలింగ్ కూడా ఇచ్చాం. వారి అలవాట్లు, గత నేర చరిత్ర, కుటుంబ నేపథ్యం వంటి వాటిని పరిశీలించాం. వారిలో చాలా మంది యువకులు, చెడు అలవాట్లకు గురై ఇలా నేరాలకు పాల్పడుతున్నట్లు తెలిసింది. " -కాంతి రాణా టాటా, కమిషనర్‌

బ్లేడ్ బ్యాచ్ కు అడ్డాగా బెజవాడ...నేరాలపై సీపీ ప్రత్యేక దృష్టి...

నగరంలో 75 మంది వరకు బ్లేడ్‌ బ్యాచ్‌ సభ్యులు ఉంటారని పోలీసులు తేల్చారు. వీరిలో 50 మంది వరకు చురుగ్గా వ్యవహరిస్తున్నారు. బ్లేడ్‌బ్యాచ్‌ సభ్యులను వారి చర్యలను బట్టి 3 రకాలుగా విభజించారు. వారి మానసిక, ఆర్థిక స్థితి, ఇతర సమస్యలను గుర్తించి, దానికి తగ్గట్లుగా వారి తల్లిదండ్రులకు, బ్యాచ్‌ సభ్యులకు కౌన్సిలింగ్ ఇవ్వనున్నారు. వీరందరి అలవాట్లు, ఆసక్తి, నైపుణ్యాలు పరిశీలించి ఉపాధి కల్పించే దిశగా దృష్టి పెట్టామని పోలీసులు చెబుతున్నారు. వివిధ వృత్తులపై శిక్షణ ఇచ్చే సమయంలో ఉద్యోగ భృతి చెల్లించనున్నారు.

" " వారి ప్రవర్తనను మార్చే విధానంలో భాగంగా 3 రకాలుగా చర్యలను ప్రారంభించాం. కౌన్సిలింగ్ తో పాటుగా వీరందరి అలవాట్లు, ఆసక్తి, నైపుణ్యాలు పరిశీలించి ఉపాధి కల్పించే దిశగా దృష్టి సారించాం. " -కాంతిరాణా టాటా, విజయవాడ సీపీ

ఇదీ చదవండి : NIT student suicide : రెండేళ్లుగా ఒకే గది.. ఆన్‌లైన్‌ పాఠాలు..ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థి ఆత్మహత్య

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.