దుబాయ్... కువైట్ వంటి దేశాల్లో చిక్కుకున్న భారతీయులను కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విమానాల ద్వారా తీసుకొచ్చేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా సోమవారం ఉదయం విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రత్యేక విమానం రానుంది. ఈ సందర్భంగా ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల ఏర్పాట్లపై విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు విమానాశ్రయానికి చేరుకుని అధికారులతో సమీక్షించారు. సుమారు 150 మంది వచ్చే అవకాశం ఉండటంతో వారికి పెయిడ్ క్వారంటైన్, లేదా ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్లకు తరలించడానికి కావల్సిన ఏర్పాట్లపై చర్చించారు. ప్రత్యేక విమానంలో వచ్చిన వారందరికి థర్మో స్క్రీనింగ్ పరీక్షలు చేసిన అనంతరం క్వారంటైన్లకు తరలిస్తామని సీపీ వెల్లడించారు.
ఇదీ చూడండి: