ETV Bharat / city

Vijayawada Swachh Survekshan Rank : చెత్తరహిత నగరాల్లో.. విజయవాడకు మెరుగైన ర్యాంక్

విజయవాడ నగరపాలక సంస్థకు స్వచ్ఛ సర్వేక్షణ్​లో (Swachh Survekshan) మూడో ర్యాంక్​ లభించింది. దిల్లీలో రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ చేతుల మీదుగా ఈ అవార్డును నగరపాలక సంస్థ కమిషనర్​ ప్రసన్న వెంకటేశ్​, మేయర్​ రాయన భాగ్యలక్ష్మి అందుకున్నారు.

Vijayawada Swachh Survekshan Rank
చెత్తరహిత నగరంలో విజయవాడ ర్యాంక్​
author img

By

Published : Nov 20, 2021, 4:48 PM IST

స్వచ్ఛ సర్వేక్షణ్​లో(Vijayawada Swachh Survekshan Rank) విజయవాడ నగరపాలక సంస్థ మూడో ర్యాంకు సాధించింది. దేశవ్యాప్తంగా సుమారు 4,500 నగరాల్లో కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే నిర్వహించింది. ఇందులో విజయవాడ నగరపాలక సంస్థకు మూడో స్థానం దక్కింది.

ఈ అవార్డును దిల్లీలో రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ చేతుల మీదుగా.. నగరపాలక సంస్థ కమిషనర్​ ప్రసన్న వెంకటేశ్​, మేయర్​ రాయన భాగ్యలక్ష్మి అందుకున్నారు. నగరపాలక సంస్థ అందిస్తున్న సేవల్లో మూడు విభాగాలను పరిశీలించి.. ఈ ర్యాంకును అందజేసినట్లు అధికారులు తెలిపారు. 2021 ఏడాదికి స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మూడో ర్యాంకు రావటం సంతోషకరమని నగరపాలక సంస్థ అధికారులు ఆనందం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: విజయవాడలో స్వచ్ఛ సర్వేక్షన్ పోటీలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.