ETV Bharat / city

కొడుకు మృతి... కోడలుపై అనుమానం! - woman files on case about son death in vijayawada

విజయవాడ అజిత్ సింగ్ నగర్​కు చెందిన ఓ మహిళ.. తన కొడుకు అనుమానాస్పద రీతిలో మృతి చెందాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కొడుకు మృతదేహంపై గాయాలు, కోడలు పొంతలేని సమాధానాలతో.. మృతిపై అనుమానాలు ఉన్నాయని పోలీసులకు తెలిపింది.

కొడుకు మృతి... కోడలుపై అనుమానం!
కొడుకు మృతి... కోడలుపై అనుమానం!
author img

By

Published : May 27, 2020, 11:55 AM IST

విజయవాడ అజిత్ సింగ్ నగర్​కు చెందిన కృష్ణకుమారి అనే మహిళ తన కొడుకు అనుమానాస్పద రీతిలో మరణించాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. గన్నవరం దవాజిగూడెంలో ఈ నెల 22న కృష్ణకుమారి కుమారుడు గుడివాడ కోటేశ్వరరావు మృతి చెందాడు. అంత్యక్రియలు చేస్తున్న సమయంలో మృతదేహంపై గాయాలున్నట్లు కృష్ణకుమారి గుర్తించింది.

గాయాల గురించి కోడల్ని ప్రశ్నించిగా.. గుండెనొప్పితో బాత్​రూంలో పడి చనిపోయాడని సమాధానం ఇచ్చింది. కొడుకు మరణం తర్వాత కోడలు, ఆమె బంధువులు చెబుతున్న సమాాధానాలు పొంతన లేకపోవటంపై అనుమానం వచ్చిన కృష్ణకుమారి.. అజిత్ సింగ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి ఆధారాలు సేకరిస్తామని తెలిపారు.

ఇదీ చదవండి:

మటన్​ వ్యాపారి ఇంట వేడుక... 22 మంది కరోనా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.