విజయవాడ గొల్లపూడిలోని అవినీతి నిరోధక శాఖ కార్యాలయంలో విజిలెన్స్ వారోత్సవాల కార్యక్రమం చివరిరోజు ఘనంగా నిర్వహించారు. ఏపీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డీఐజీ దామోదర్ చివరిరోజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సామాన్య ప్రజలకు, సమాజ శ్రేయస్సు కోసం అనిశా, విజిలెన్స్ శాఖలు ఏ విధంగా పని చేస్తున్నాయో తెలియజేయడానికే విజిలెన్స్ వారోత్సావాలని దామోదర్ వెల్లడిచారు. ఉక్కుమనిషి వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా వారోత్సవాలు జరుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులతో అవినీతికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు.
ఇదీచదవండి