తెలుగు రాష్ట్రాల విద్యుత్ ఉద్యోగుల విభజనపై సుప్రీం కోర్టులో వాదనలు జరిగాయి. జస్టిస్ ధర్మాధికారి కమిటీ నివేదికపై తెలంగాణ విద్యుత్ సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఇవాళ వాదనలు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థలు వినిపించాయి. తెలంగాణ సంస్థలు లేవనెత్తిన అంశాలను ఏపీ వ్యతిరేకించింది. ఎంతమందిని ఏపీకి కేటాయించారో అంతమందీ తెలంగాణకు వెళ్లాలని.. స్థానికత ఆధారంగా కేటాయింపులు సరికాదని కోర్టులు చెప్పాయని ఏపీ సంస్థలు స్పష్టం చేశాయి. జస్టిస్ ధర్మాధికారి అన్నీ లెక్కించే కేటాయించారని పేర్కొన్నాయి. గత విచారణలో తెలంగాణ విద్యుత్ సంస్థలు వాదనలు వినిపించాయి.
ఇదీ చదవండి: నెల్లూరుకు 'నివర్' ఎఫెక్ట్.. ఇతర ప్రాంతాల్లోనూ వర్షాలు