విజయవాడ ఇంద్రకీలాద్రిపై వసంత నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. జగన్మాత కనకదుర్గమ్మకు గత తొమ్మిది రోజులుగా.. వివిధ రకాల పుష్పాలతో అర్చన చేస్తున్నారు. చివరి రోజున కనకాంబరాలు, గులాబీలతో అమ్మవారికి అర్చన జరిపారు.
ఇదీ చదవండి: బియ్యం గింజలతో సీతారాముల చిత్రపటం
గోశాల ఎదుట ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక వద్దకు ఆయా పుష్పాలను తీసుకొచ్చి.. వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య రుత్విక్కులు అమ్మవారికి పుష్పార్చన చేశారు. అనంతరం పంచహారతులు సమర్పించారు. ఉభయదాతలకు దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం చేయించి.. శేషవస్త్రాలు, ప్రసాదాలు అందించారు.
ఇదీ చదవండి: