ETV Bharat / city

జాతీయ ఎస్సీ కమిషన్​కు వర్ల రామయ్య లేఖ - దళితులపై దాడులపై వార్తలు

చిత్తూరు జిల్లాలో ఆటో డ్రైవర్ ఓం ప్రతాప్‌ ఆత్మహత్యకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని జాతీయ ఎస్సీ కమిషన్ కు వర్ల రామయ్య లేఖ రాశారు. రాష్ట్రంలో దళితులపై వరుసగా జరుగుతున్న దాడులపై విచారణ చేపట్టాలని కోరారు.

varla ramaiyya letter to national sc commission on attack on sc's
వర్ల రామయ్య
author img

By

Published : Aug 27, 2020, 9:59 AM IST

చిత్తూరు జిల్లాలో దళిత వర్గానికి చెందిన ఆటో డ్రైవర్ ఓం ప్రతాప్‌ ఆత్మహత్యకు ప్రోత్సహించిన వైకాపా నాయకులపై చర్యలు తీసుకోవాలని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య జాతీయ ఎస్సీ కమిషన్​కు లేఖ రాశారు. దళితులపై దాడులు గురించి పదేపదే కమిషన్‌కు లేఖలు రాస్తున్నందుకు తనను క్షమించాలని లేఖలో వర్ల రామయ్య పేర్కొన్నారు. ఆత్మహత్య చేసుకున్న ప్రతాప్..‌ తన భావాలను సామాజిక మాధ్యమంలో వ్యక్తం చేస్తే.. వైకాపా నాయకులు అతన్ని బెదిరించారని వర్ల రామయ్య అన్నారు. చంపుతామని ఫోన్లు చేస్తే, గత్యంతరం లేక, భయపడి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. దళితులపై వరసగా దాడులు జరుగుతున్నా వైకాపా ప్రభుత్వానికి లెక్కలేదని వర్ల రమయ్య అన్నారు.

ఇదీ చదవండి: తెలుగునాట వినోదాల వీచిక.. 'ఈటీవీ' రజతోత్సవ వేడుక

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.