వైకాపా కార్యకర్తలు చేసిన దాడులపై ఫిర్యాదు చేసేందుకు తమ అధినేత చంద్రబాబు డీజీపీ కార్యాలయానికి వెళ్తే.. గేటు మూసేసి ఉండడంపై తెదేపా నేత వర్ల రామయ్య ఆగ్రహించారు. శాంతి భద్రతల డీజీ వచ్చి ఫిర్యాదు తీసుకున్నారని చెప్పారు. చంద్రబాబును పోలీసులు లోపలికి పిలిచారన్నది అవాస్తవమన్నారు. చేతనైతే మాచర్ల దాడికి కారకులైన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. రక్షణ కల్పించటంలో విఫలమైన పోలీసులపై చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రానికి అసలు హోంమంత్రి సజ్జల రామకృష్ణ రెడ్డి అని ఆరోపించారు. మహిళగా ఉన్న హోం మంత్రి.. అబద్ధాలు చెప్పారని, అది సరికాదని వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి: