మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ముఖ్యమంత్రి జగన్‌కు నార్కో అనాలసిస్ పరీక్ష చేయించాలని తెదేపా నేత వర్ల రామయ్య డిమాండ్ చేశారు. హత్య కేసు అనుమానితుడు శివశంకర్ రెడ్డి సీఎం జగన్ను కలిశారనే సమాచారం ఉందన్నారు. శివశంకర్ రెడ్డిని తనను ఎందుకు కలిశారో జగన్ చెప్పాలన్నారు. ఈ అంశంపై సీబీఐ విచారణ జరపాలని ఆయన కోరారు. జగన్‌కు తెలియకుండా హత్య జరిగితే కేసు విచారణ ఇలా ఉండదని వ్యాఖ్యానించారు.
డీజీపీ కూడా సీబీఐకి సహకరించట్లేదు కాబట్టే కేసు ముందుకు సాగట్లేదన్నారు. వివేకా చనిపోయినప్పుడు కుట్లు వేసిన వైద్యుడు గంగిరెడ్డి, ప్రస్తుత ఎంపీ అవినాష్ రెడ్డిలకు లై డిటెక్టర్ పరీక్షలు సీబీఐ ఎందుకు చేయించలేదని ప్రశ్నించారు. వివేకా కేసును హైకోర్టు ఓసారి పునఃసమీక్షించి సీబీఐకి తగు ఆదేశాలివ్వాలన్నారు. పక్కా ప్రణాళికతోనే వివేకా హత్యకు కుట్ర జరిగిందని ఆరోపించారు.
ఇదీచదవండి
రోజుకు 6 లక్షల మందికి కరోనా టీకా వేసేలా ఏర్పాట్లు: సీఎం జగన్