'ఓం ప్రతాప్ మృతికి కారకులెవరో తేల్చాలని డీజీపీకి లేఖ రాసినందుకే నాకు నోటీసులిస్తారా?' అని వర్ల రామయ్య ప్రశ్నించారు. ఓం ప్రతాప్ ఆత్మహత్య చేసుకుని ఉంటే అతని మృతదేహం పోస్ట్ మార్టం చెయ్యకుండా ఎలా ఖననం చేస్తారని నిలదీశారు. చనిపోయిన వ్యక్తి సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసు అధికారి ఎవరని ప్రశ్నించారు.
దర్యాప్తు అధికారి.. తమ లాంటి వారికి నోటీసులిచ్చి సమయం వృథా చేసుకోకుండా కేసుపై దృష్టి సారిస్తే మంచిదని వర్ల హితవు పలికారు. ఇప్పటికైనా ఓం ప్రతాప్‌ది ఆత్మహత్యా? లేక హత్యా? అనేది తేలాలన్నారు. మరణానికి కారకులైన వారు ఎంతటి స్థాయిలో ఉన్నా.. కఠిన చర్యలు తీసుకోవాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: