నరసరావుపేట డిగ్రీ విద్యార్థిని హత్య ఘటన రాష్ట్రంలో మహిళల భద్రతను ప్రశ్నార్థకం చేస్తోందని తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ధ్వజమెత్తారు. పులివెందుల ఫ్యాక్షనిజాన్ని రాష్ట్ర వ్యాప్తం చేశారని ప్రభుత్వంపై మండిపడ్డారు. మహిళలకు రక్షణగా ఉంటామని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్..హత్యాచారాలు జరుగుతున్నా ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని విమర్శించారు. దిశ చట్టంతో ఒక్క మహిళకూ న్యాయం జరగలేదన్నారు. ఐపీసీ, సీఆర్పీసీల సవరణలు రాష్ట్ర పరిధిలో ఉండవనే విషయం ఈ ప్రభుత్వానికి తెలియదా? అని ప్రశ్నించారు. మహిళా హోంమంత్రి ఉండి కూడా ఒక్కరికీ న్యాయం జరగకపోవటం శోచనీయమన్నారు.
నాడు వదిలిన బాణాన్ని నేడు వదిలించుకున్నారు..
3వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి అన్నను అధికారంలోకి తెస్తే...నాడు వదిలిన బాణాన్ని నేడు వదిలించుకున్నారని సీఎం జగన్ సోదరి షర్మిల అంటోందని మాజీ మంత్రి జవహర్ దుయ్యబట్టారు. పంచాయతీ ఎన్నికల్లో ఓ ఫ్యాన్ రెక్క ఊడిందని.. మున్సిపాలిటీలకు రెండోది, జడ్పీటీసీలతో మూడోది ఊడి ఫ్యాన్‌కి మూడుతుందని ట్విటర్ వేదికగా వ్యగ్యాంస్త్రాలు సంధించారు.
ఇదీచదవండి
ఉత్తమ వాలంటీర్లకు ఉగాది నుంచి సత్కారాలు..3 కేటగిరీలుగా అర్హుల ఎంపిక