ETV Bharat / city

'పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డాం'

author img

By

Published : Aug 13, 2020, 5:04 PM IST

రాజ్యాంగంలోని నిబంధనలు, చట్టాలను అనుసరించి అమరావతి నుంచి రాజధానిని విశాఖకు తరలించడం అసాధ్యమని మాజీమంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్ గ్రహించి, బేషజాలకు పోకుండా అమరావతిలోనే రాజధాని కొనసాగుతుందని ప్రకటించి తన గౌరవాన్ని నిలబెట్టుకోవాలని హితవుపలికారు.

'పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డాం'
'పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డాం'
మాజీమంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు

రాష్ట్రంలో రాజ్యాంగబద్ధమైన పాలన అమలు చేయకపోతే... రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 355, 356ను అనుసరించి గవర్నర్‌ పాలన విధించే అధికారం కేంద్రానికి ఉందని మాజీ మంత్రి శోభనాద్రీశ్వరరావు అన్నారు. చంద్రబాబు పాలనలో పాలనపరమైన వైఫల్యాల కారణంగా రాష్ట్రంలో జగన్మోహన్​రెడ్డి నేతృత్వంలోని వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రం పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడిన చందాన మారిందన్నారు. అందుకే తాను రాసిన పుస్తకానికి ఆ పేరు పెట్టినట్లు చెప్పారు.

జస్టిస్‌ వెంకట గోపాల గౌడ

రాజధాని అమరావతిలో పరిస్థితులు, మూడు రాజధానుల వల్ల ముప్పును వివరిస్తూ వడ్డే రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించడం సంతోషంగా ఉందని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ వెంకట గోపాల గౌడ అన్నారు. ఈ అంశం ప్రస్తుతం న్యాయస్థానాల్లో ఉన్నందున తాను ఎక్కువగా స్పందించలేనని చెప్పారు. ప్రజా ప్రభుత్వం వ్యక్తిగత ప్రయోజనం కన్నా ప్రజల ప్రయోజనాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రజలు కూడా ‌చట్ట విరుద్ధంగా పాలన సాగించే ప్రభుత్వాలను నిలదీయాలని... ప్రశ్నించే తత్త్వాన్ని పెంచుకోవాలని సూచించారు.

ప్రభుత్వం న్యాయస్థానాలపై కూడా దాడి చేసేలా కుట్రలు చేస్తోందని ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ప్రముఖ న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్ అన్నారు. ఏ వ్యవస్థకు ఉండే అధికారం... ‌ఆ వ్యవస్థలకు ఇస్తూ రాజ్యాంగం రూపొందించారని.. అధికార బలం ఉందని ఇష్టం వచ్చినట్లు చేస్తే.. న్యాయ వ్యవస్థ చూస్తూ ఊరుకోబోదన్నారు.

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు

జగన్మోహన్ రెడ్డి తన 14 నెలల పాలనలో అనేక సమస్యలు ఉన్నా... అమరావతి మీద ఎక్కువగా మాట్లాడుకునేలా చేశారని.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. రాజధానిగా అమరావతిని అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఇదివరకు ఆమోదించాయని... అధికారంలోకి వచ్చాక వైకాపా మాట మార్చి రాజధాని తరలింపును తెరపైకి తీసుకురావడం అంటే ఇదేమైనా సీఎం జాగీరా అని ప్రశ్నించారు. ఇది 29 గ్రామాల ప్రజల సమస్య కాదని... ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవం అని అన్నారు.

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

తెలంగాణ వాళ్లు రాజధాని ఏది అంటే గర్వంగా హైద్రాబాద్ అని చెప్పుకుంటారని... ఏపీ ప్రజలు గర్వంగా చెప్పుకునే రాజధాని అమరావతి అని వివిధ సర్వేల్లో 80 శాతం ప్రజలు మద్దతు పలికారన్నారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్‌ చేశారు. మూడు రాజధానులపై ఇప్పటికిప్పుడు ప్రజలు వ్యతిరేకిస్తున్నట్లు కనపడకపోవచ్చని... రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం సమస్యల సుడిగుండాల్లో కొట్టుకుపోతుందని హెచ్చరించారు.

ఇదీ చదవండి:

సంక్షేమాన్ని గాలికొదిలేసి సంక్షోభాలను సృష్టిస్తున్నారు: కళా వెంకట్రావు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.