రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడత కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభం అయింది. విజయవాడ జీజీహెచ్‌లో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని.. ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైద్య సిబ్బంది మొదలు పెట్టారు. అంతకు ముందు... వ్యాక్సినేషన్ ప్రక్రియ తీరు తెన్నుల గురించి.. వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సీఎం మాట్లాడారు. అనంతరం టీకా పంపిణీ ఏర్పాట్లను పరిశీలించారు. సిబ్బందితో పాటు టీకా వేయించుకునేందుకు సిద్ధంగా ఉన్న వారితో మాట్లాడారు.
రాష్ట్రవ్యాప్తంగా 332 కేంద్రాల్లో వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో వ్యాక్సినేషన్ చేపట్టారు. రోజుకు 33,200 మందికి టీకా వేస్తారు. 15 రోజుల్లో తొలివిడత వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. తొలి విడత టీకా వేయించుకున్న వారికి 28 రోజుల తర్వాత రెండో విడత టీకా ఇవ్వనున్నారు.
ఇదీ చదవండి: