ETV Bharat / city

45 ఏళ్లు పైబడిన వారికి నేటి నుంచి టీకా: అనిల్ సింఘాల్ - anil singhal

హై రిస్క్‌ కేటగిరీకి చెందిన 45 ఏళ్లు పైబడిన వారికి.. నేటి నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియ పునఃప్రారంభం కానుందని ఆరోగ్య శాఖ కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ పేర్కొన్నారు. రాష్ట్రంలో మొత్తం 13.13 లక్షల డోసుల టీకాలు అందుబాటులో ఉన్నట్లు ఆయన వివరించారు.

45 ఏళ్లు పైబడిన వారికి నేటి నుంచి టీకా
45 ఏళ్లు పైబడిన వారికి నేటి నుంచి టీకా
author img

By

Published : May 24, 2021, 6:44 AM IST

45 ఏళ్లు పైబడిన వారికి నేటి నుంచి టీకా

హైరిస్క్‌ కేటగిరీకి చెంది.. 45 ఏళ్లు పైబడిన వారికి నేటి నుంచి మూడు రోజుల పాటు వ్యాక్సినేషన్‌ కార్యక్రమం నిర్వహించనున్నట్లు వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. ప్రజలతో నిత్యం సంబంధాలు కలిగిన ఆర్టీసి, రైల్వే, బ్యాంకింగ్, పోర్టులు, ప్రజాపంపిణీ వ్యవస్థలో పని చేసే ఉద్యోగులు, సిబ్బంది, కార్మికులు, పాత్రికేయులను హైరిస్క్‌ కేటగిరీగా గుర్తించామన్నారు. రాష్ట్రంలో 13.13 లక్షల డోసుల టీకాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. వీటిలో 1.55 లక్షల కొవాగ్జిన్‌ టీకాలను రెండో డోసు కింద, 11.58 లక్షల కొవిషీల్డ్‌ టీకాలను మొదటి డోసుగా ఇస్తారని సింఘాల్ వివరించారు. టీకాల కొరతతో 18 నుంచి 45 ఏళ్ల లోపు వారికి ప్రస్తుతానికి వ్యాక్సినేషన్ లేదని ఆయన స్పష్టం చేశారు. ఆక్సిజన్‌పై నిర్వహిస్తున్న ఆడిట్‌తో చాలా ఆస్పత్రుల్లో 10 నుంచి 15 శాతం తగ్గుదల కనిపించిందని తెలిపారు.

గత 3 రోజుల్లో వెల్లడైన కరోనా పరీక్షల ఫలితాలను పరిశీలిస్తే.. రాష్ట్రంలో కొవిడ్ పాజిటివ్‌ కేసుల్లో తగ్గుదల కనిపిస్తోందని అనిల్‌కుమర్‌ సింఘాల్ చెప్పారు. గత మూడు రోజులుగా.. రోజూ వెయ్యి చొప్పున కేసులు తగ్గుతూ వచ్చాయన్నారు. దానికి తోడూ ఆస్పత్రుల్లో పడకల ఖాళీలు కూడా పెరిగాయని తెలిపారు. ఇదే పరిస్థితి కొనసాగితే కరోనా త్వరలోనే నియంత్రణలోకి వస్తుందని ఆశిస్తున్నామన్నారు. జ్వరాల సర్వేలో సేకరిస్తున్న నమూనాల పరీక్ష ఫలితాలు 36 గంటల్లో వెలువడేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు ఆదివారం 41 వేల 779 రెమ్‌డెసివర్ ఇంజక్షన్లు సరఫరా చేశామని చెప్పారు. బ్లాక్‌ ఫంగస్‌కు సంబంధించి జిల్లాలకు వెయ్యి ఇంజక్షన్లు, మందులు పంపామని వివరించారు.

ఇదీ చదవండి:

'మిస్​ యూ నాన్న!'.. యాంకర్​ ప్రదీప్ భావోద్వేగపు పోస్ట్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.