సీపీఎస్ రద్దు చేయకుంటే ఉద్యోగ, ఉపాధ్యాయులతో కలిసి త్వరలో మిలిటెంట్ ఉద్యమానికి శ్రీకారం చుడతామని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు హెచ్చరించారు. సీపీఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా యూటీఎఫ్ ఆధ్వర్యంలో బైక్ జాతర నిర్వహించారు. కడపలో పోలీసుల నుంచి తీవ్ర స్థాయిలో అడ్డంకులు రావడంతో తక్కువ మందితోనే బైక్ యాత్ర చేపట్టారు. కాకినాడ జిల్లా తునిలో ద్విచక్ర వాహన ప్రదర్శన జరిగింది. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ద్విచక్రవాహన ర్యాలీ చేపట్టారు. విజయవాడలో ఈ నెల 25వ తేదీన 30 వేలమంది ఉద్యోగులతో మహా ధర్నా నిర్వహిస్తామన్నారు.
ఇదీ చదవండి: తోటి విద్యార్థి పట్ల అమానుషం.. నగ్నంగా చేసి, చితకబాది...