తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాల్లో మిషన్ భగీరథ నీటి బాటిళ్ల వినియోగం ప్రారంభమైంది. గ్రామపంచాయతీ మొదలు సచివాలయం వరకు భగీరథ బాటిళ్లనే ఉపయోగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించిన మేరకు.. వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల సమీక్షలో మిషన్ భగీరథ బాటిళ్లనే ఉపయోగించారు.
మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు... అందరికీ వీటినే అందించారు. తెలంగాణ రాష్ట్ర విజయాలను సమావేశంలో ప్రస్తావించిన సీఎం కేసీఆర్.. మిషన్ భగీరథ గురించి సైతం వివరించారు. అదే సమయంలో భగీరథ బాటిల్‌ని చూపుతూ ఈ పరిణామాన్ని ఎవరైనా ఊహించారా అని వ్యాఖ్యానించారు. ఈ దిశగా అధికారుల శ్రమను ప్రశంసించారు.
ఇదీ చూడండి: