విజయవాడలో మూడు ఫ్లైఓవర్ల నిర్మాణానికి ఇచ్చిన ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయని కేంద్ర రహదారులు, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. విజయవాడ మహానాడు జంక్షన్ నుంచి నిడమానూరు జంక్షన్ వరకు మూడు ఫ్లైఓవర్ల నిర్మాణ ప్రతిపాదనలను ఎంపీ కేశినేని నాని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ముందుంచారు. మహానాడు జంక్షన్, రామవరప్పాడు జంక్షన్, ఎనికేపాడు జంక్షన్ల వద్ద మూడు ఫ్లైఓవర్ల నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. దీని వల్ల భూసేకరణ ఖర్చు తగ్గటమే కాక వాహనాల రాకపోకలకు అనువుగా ఉండి ప్రజలకు, రవాణాకు అత్యంత ఉపయోగకరంగా ఉంటుందని లేఖలో నాని పేర్కొన్నారు. ఈ మూడు ఫ్లైఓవర్లు నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి సత్వరం నిర్మాణ కార్యక్రమాలను మొదలు పెట్టాలని కోరారు. కేశనేని లేఖపై స్పందించిన గడ్కరీ.. ప్లైఓవర్ల నిర్మాణానికి ఇచ్చిన ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయని లేఖ ద్వారా తెలియజేశారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపు.. ఎంత పెరిగాయంటే..?