ETV Bharat / city

పోలవరానికి ప్రతి పైసా కేంద్రమే ఇస్తుంది: షెకావత్‌ - polavaram news

Gajendrasingh Shekhawath at polavaram: విభజన చట్టం ప్రకారం.. పోలవరం నిర్మాణానికి ఖర్చు మొత్తం కేంద్రమే భరిస్తుందని జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ ఉద్ఘాటించారు. నిర్ణీత సమయంలోపు పనులు పూర్తి చేసేందుకు.. రాష్ట్రంతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నామని వెల్లడించారు. పునరావాస కాలనీల్లో వసతులు సహా పోలవరం పనులను సీఎం జగన్‌తో కలిసి షెకావత్ పరిశీలించారు.

gajendrasingh shekawath visited polavaram
పోలవరం పూర్తికి కేంద్రం పూర్తిగా సహకరిస్తోంది: గజేంద్రసింగ్ షెకావత్‌
author img

By

Published : Mar 4, 2022, 7:01 PM IST

Updated : Mar 5, 2022, 5:38 AM IST

పోలవరం పూర్తికి కేంద్రం పూర్తిగా సహకరిస్తోంది: గజేంద్రసింగ్ షెకావత్‌

Gajendrasingh Shekhawath at polavaram: పోలవరం నిర్మాణానికి అవసరమైన ప్రతి పైసా కేంద్రమే ఇస్తుంది. ఈ ప్రాజెక్టును పూర్తిచేస్తామని ఇచ్చిన హామీ మేరకు మా ప్రభుత్వమే ప్రాజెక్టును పూర్తిచేస్తుంది. నిధుల సమస్య పరిష్కారం కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఇంకా మాకు వివరాలు పంపాలి. ఆ వెంటనే మా పని చేస్తాం. పోలవరం నిర్వాసితులకు నేరుగా నగదు బదిలీ చేయాలని ముఖ్యమంత్రి కోరారు. ఇందుకు చర్యలు తీసుకుంటాం. ప్రాజెక్టుకు నేను రెండేళ్ల కిందటే వచ్చి ఉంటే పనులు ఇంకా వేగంగా జరిగేవి. కరోనా వల్ల రాలేకపోయా. ఇందులో ఇబ్బందులన్నింటిపై దృష్టిపెట్టాను. ఇక 15 రోజులకోసారి 3నెలల పాటు ఈ ప్రాజెక్టు పురోగతిని సమీక్షించాలని నిర్ణయించా’ అని కేంద్ర జల్‌శక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెఖావత్‌ వెల్లడించారు. ఆయన సీఎం జగన్‌తో కలిసి ప్రాజెక్టును శుక్రవారం సందర్శించారు. అంతకుముందు ఉభయగోదావరి జిల్లాల్లోని నిర్వాసితుల కాలనీలను పరిశీలించి అక్కడ మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టును పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రికి, ముఖ్యమంత్రికి అధికారులు ప్రాజెక్టు పురోగతి వివరాలు తెలియజేశారు. పోలవరం అధికారులు, అథారిటీ అధికారులతో కేంద్రమంత్రి, సీఎం సమీక్షించారు.

పోలవరాన్ని 1970ల్లోనే అనుకున్నాం... కానీ..

అనంతరం కేంద్రమంత్రి షెఖావత్‌ మాట్లాడారు...‘పోలవరం ప్రాజెక్టుపై 15 రోజులకోసారి మూడు నెలల పాటు సమీక్షిస్తానని తెలిప. పీపీఏ అధికారులతో పాటు పోలవరం అధికారులంతా దీనికి హాజరుకావాలి. 15 రోజులంటే 15 రోజులే. 16వ రోజు కాదు. నిర్వాసితులను పునరావాస కాలనీలకు తరలించేందుకు నిర్దిష్ట కార్యాచరణ ఉండాలి. ప్రాజెక్టు అథారిటీ, మంత్రిత్వశాఖ స్థాయిలో నెలవారీ పురోగతి నివేదికలు ఇవ్వాలి. ప్రాజెక్టు నిర్వాసితులకు, ముంపు బాధితులకు ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా పరిహారాన్ని ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరారు. ఇందుకు అంగీకరిస్తున్నా. అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి. పోలవరం ప్రాజెక్టు అథారిటీ కార్యాలయాన్ని రాజమహేంద్రవరానికి తరలించాలి. దిగువ కాఫర్‌డ్యాం, ప్రధానడ్యాం నిర్మాణ ప్రాంతంలో గోదావరి గర్భం కోతకు గురైన ప్రాంతం పూడ్చడం, నిర్మాణాలు పటిష్ఠంగా చేసేందుకు డిజైన్లు ఖరారు చేయాలి. ఈ విషయంలో జాప్యం తగదు. అవసరమైతే అంతర్జాతీయ నిపుణులతో మాట్లాడి నిర్ణయం తీసుకోవాలి. 15 రోజుల్లో ఈ అంశాన్ని పీపీఏ అధికారులు, డ్యాం డిజైన్‌ రివ్యూ అధికారులు కొలిక్కి తీసుకురావాలి. ప్రాజెక్టుపై ఒక డ్యాష్‌బోర్డు ఏర్పాటుచేయాలి. దీనివల్ల ఎప్పటికప్పుడు ప్రగతి తెలుస్తుంది. ముఖ్యమంత్రి నివేదించిన ఇతర అంశాలపైనా అధికారులతో చర్చించి ముందుకు సాగుతాం’ అని తెలిపారు. పోలవరాన్ని 1970ల్లోనే అనుకున్నారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అనుకుని యాభై ఏళ్లు దాటినా పూర్తికాలేదు. ఇప్పుడు హామీ ఇస్తున్నాం. ఏడాదిలోగా ప్రాజెక్టు పూర్తికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనిపై ఇప్పటికే ప్రధాని మోదీతో సీఎం సుదీర్ఘంగా చర్చించారు’ అని తెలిపారు.

.

15 రోజులకోసారి బిల్లులివ్వాలి: సీఎం

కేంద్ర మంత్రి షెఖావత్‌ ముందు సీఎం జగన్‌ అనేక ప్రతిపాదనలు ఉంచారు. ‘పోలవరం ప్రాజెక్టు మొత్తాన్ని ఒకే కాంపొనెంట్‌గా పరిగణించాలి. ప్రతి 15 రోజులకోసారి బిల్లులు ఇవ్వాలి. దీనివల్ల ప్రాజెక్టు పనులు వేగంగా సాగేందుకు నిధుల లభ్యత ఉంటుంది. ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం వివిధ కాంపొంనెంట్ల వారీగా బిల్లులు చెల్లిస్తోంది. దీనివల్ల పోలవరం కుడి, ఎడమ కాలువల పనులు ముందుకు సాగడం లేదు. చేసిన పనులకూ బిల్లులను పోలవరం అథారిటీ అప్‌లోడ్‌ చేయడం లేదు. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చుకు, కేంద్రం రీయింబర్సు చేసినదానికి భారీ వ్యత్యాసం ఉంటోంది. వివిధ పనుల కింద రూ.859.59 కోట్ల బిల్లులను పోలవరం అథారిటీ నిరాకరించింది. తాగునీటి విభాగం ఖర్చులనూ ప్రాజెక్టులో భాగంగా పరిగణించాలి. 2017-18 ధరల ప్రకారం ప్రాజెక్టుకు రూ.55,548.87 కోట్లుగా ఖరారుచేయాలి. పోలవరంలో వరదల వల్ల కోత పడ్డ ప్రాంతాల్లో డిజైన్లు ఇంతవరకూ ఖరారు చేయలేదు. నిర్వాసితులకు ప్యాకేజీ సొమ్ము రూ.6.8 లక్షల నుంచి రూ.10 లక్షలు ఇస్తానన్న హామీ నిలబెట్టుకుంటా. వైఎస్‌ హయాంలో ఎకరం రూ.1.5 లక్షలకే ఇచ్చిన వారికి రూ.5 లక్షలు ఇస్తామనే మాట ప్రకారం మిగిలిన రూ.3.5 లక్షలు అందిస్తాం. పోలవరం నిర్మాణానికి కేంద్ర సహకారం అవసరం. తాడువాయి పునరావాస కాలనీలో 3,905 ఇళ్లు నిర్మిస్తున్నాం. ఇవి పూర్తయితే పోలవరం కోసం సహకరించిన ప్రతి లబ్ధిదారుడికీ ఇల్లు వస్తుంది. ఉపాధి, శిక్షణ అవకాశాలు చూడాలని విజ్ఞాపనలొస్తున్నాయి. దీనిపై కేంద్రమంత్రితో మాట్లాడాను. ఆయన సుముఖంగా ఉన్నారు’ అని చెప్పారు.

.

పెద్ద టౌన్‌షిప్‌గా మారుస్తాం...

నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌ మాట్లాడుతూ.. ‘దాదాపు రూ.435 కోట్లతో తాడువాయి పునరావాస కాలనీలో ప్రభుత్వం ఇళ్లు నిర్మిస్తోంది. ఇది పూర్తయితే పోలవరం ప్రాజెక్టు పరిధిలోనే ఇది పెద్ద కాలనీగా మారబోతోంది. దాదాపు వెయ్యి ఇళ్లు పూర్తయ్యాయి. 60, 70 కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నాయి. నిధులు సకాలంలో వస్తే.. వచ్చే వర్షాకాలంలోపు నిర్మాణాలన్నీ పూర్తిచేసి పెద్ద టౌన్‌షిప్‌గా దీన్ని మారుస్తాం’ అన్నారు. ఈ కార్యక్రమాల్లో ఉపముఖ్యమంత్రులు ఆళ్ల నాని, ధర్మాన కృష్ణదాస్‌, మంత్రులు అనిల్‌యాదవ్‌, కన్నబాబు, పేర్ని నాని, శ్రీరంగనాథరాజు, తానేటి వనిత, వేణుగోపాలకృష్ణ, విశ్వరూప్‌, ఎంపీలు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తదితరులు పాల్గొన్నారు.

ముందు అర్హత ఉందన్నారు.. ఇప్పుడు లేదంటున్నారు

మా నాన్న, తమ్ముడికి పరిహారం, ఇళ్లు వచ్చాయి. ఐదేళ్ల కిందట మహిళలకు వయోపరిమితి లేదని.. మేమంతా పరిహారం, ఇళ్లు పొందేందుకు అర్హులమేనని అధికారులు చెప్పారు. ఇప్పుడు మాత్రం 18 ఏళ్లు పూర్తయి.. పెళ్లికాని వారే అర్హులంటున్నారు. దీంతో నాలాంటి ఎంతోమంది మహిళలు పరిహారం కోల్పోతున్నారు. పోశమ్మ, ఏనుగులగూడెం

ఉపాధి కల్పించండి...

రూ. 3.4 లక్షల విలువ చేసే పటిష్ఠమైన ఇళ్లిచ్చి మమ్మల్ని దేవుడిలా ఆదరించారు. కానీ ఇక్కడ చేయడానికి పనిలేదనే ఆలోచిస్తున్నాం. ఈ ఏడాది వచ్చేద్దామనుకుంటున్నాం. ఉపాధి కల్పించండి. ఎద్దువాగు ముంచేస్తే.. సామాన్లు తెచ్చుకోవడం కుదరదు. పరిహారం ఇస్తే వచ్చేస్తాం. - లక్కోజు శారద, వేలేరుపాడు మండలం కొయిదా

తెదేపా నాయకుల అడ్డగింపు

ముఖ్యమంత్రిని కలిసి నిర్వాసితుల సమస్యలపై వినతిపత్రం అందించేందుకు తెదేపా నాయకులు ప్రయత్నించగా పోలీసులు ఇందుకూరులోనే అడ్డుకున్నారు. నిర్వాసితుల సమస్యలు తెలుసుకోకుండా సీఎం వెళ్లిపోయారని, ఈ పర్యటనతో ఒరిగిందేమీ లేదని రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి విమర్శించారు. నల్లచొక్కాలు వేసుకుని వచ్చిన వారిని సభ వద్దకు అనుమతించలేదు.

ఇదీ చదవండి:

మేము అధికారంలో ఉంటే.. ఈ పాటికి పోలవరం ఉరకలెత్తేది: చంద్రబాబు

Last Updated : Mar 5, 2022, 5:38 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.