విజయవాడ ఇంద్రకీలాద్రిపై 6వ రోజున దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అవతారంలో కనకదుర్గమ్మ దర్శనమిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించింది. తితిదే పాలక మండలి సభ్యుడు, వైకాపా ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
దుర్గగుడి ఆలయ అధికారులు ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందించారు. అమ్మవారి దీవెనలతో, శ్రీవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు పార్థసారథి తెలిపారు.
ఇదీ చదవండి : బెజవాడ దుర్గమ్మకు శ్రీకాళహస్తి ఆలయం తరఫున పట్టువస్త్రాలు సమర్పణ