ETV Bharat / city

'ఆస్తులు అమ్మి డబ్బు దోచుకోవటమే వారి ఉద్దేశం' - ఆస్తుల అమ్మకంపై పుట్టా సుధాకర్ ఆగ్రహం వార్తలు

తిరుమల తిరుపతి దేవస్థానానికి దాతలు ఇచ్చిన భూములను అమ్మే హక్కు ఎవరికీ లేదని తితిదే మాజీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ స్పష్టం చేశారు. వైకాపా ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం.. భూములమ్మి డబ్బులు దోచుకోవటమే అని ఆరోపించారు.

ttd ex chairman putta sudhakar yadav about tirumala assests selling
పుట్టా సుధాకర్ యాదవ్
author img

By

Published : May 25, 2020, 9:11 PM IST

తిరుమల తిరుపతి దేవస్థానానికి దాతలు ఇచ్చిన భూములను అమ్మే హక్కు ఎవరికీ లేదని తితిదే మాజీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ స్పష్టం చేశారు. తాము వాటిని కాపాడలేం అని ప్రభుత్వం భావిస్తే.. నిజాయితీగా ఒప్పుకుని మరొక కమిటీని వేసి కాపాడాలని హితవు పలికారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఒక్క సెంటు కూడా స్వామివారి భూమిని విక్రయించలేదని గుర్తు చేశారు.

స్వామివారి భూములు మంచి ప్రాంతాల్లో ఉన్నాయన్న అయన.. అవి మారుమూలల్లో ఉన్నాయని చెప్పి వాటిని అమ్మి పబ్బం గడుపుకోవాలని వైకాపా ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. తితిదే పాలకమండలి ప్రధాన కర్తవ్యం ట్రస్టు భూములను కాపాడటమే అన్నారు. కర్తవ్యాన్ని పక్కన పెట్టి ఇచ్చిన అధికారాలను దుర్వినియోగం చేస్తూ భూములను విక్రయించాలని చూస్తున్నారని మండిపడ్డారు.

వైకాపా ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం భూములమ్మి డబ్బులు దోచుకోవటమేనని ధ్వజమెత్తారు. స్వామివారి భూములు అమ్మాలనే ఆలోచనలు మానుకోకుంటే... భక్తులు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు.

ఇవీ చదవండి:

'ఆస్తుల అమ్మకాల వ్యవహారం ఈనాటిది కాదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.