ETV Bharat / city

టాలీవుడ్ డ్రగ్స్ కేసు.. హైకోర్టు ముందుకు ఎక్సైజ్​ డైరెక్టర్ - టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై హైకోర్టు విచారణ

టాలీవుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డెరైక్టరేట్‌ (ఈడీ) దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను కొట్టివేయాలని.. తెలంగాణ ఎక్సైజ్‌ డైరెక్టర్‌ సర్ఫరాజ్​ అహ్మద్ ఆ రాష్ట్ర హైకోర్టును​ కోరారు. న్యాయస్థానం ఆదేశాల అమలులో ఆలస్యం జరిగిందని అంగీకరించి.. కోర్టుకు బేషరతుగా క్షమాపణలు చెప్పారు.

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో తెలంగాణ హైకోర్టుకు ఎక్సైజ్​ డైరెక్టర్ క్షమాపణలు

author img

By

Published : Apr 25, 2022, 2:59 PM IST

Tollywood Drugs Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డెరైక్టరేట్‌ (ఈడీ) దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను కొట్టివేయాలని తెలంగాణ హైకోర్టును.. ఆ రాష్ట్ర ఎక్సైజ్‌ డైరెక్టర్‌ సర్ఫరాజ్​ అహ్మద్​ కోరారు. ఈడీ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేసిన సర్ఫరాజ్‌ ఆహ్మద్‌.. మార్చి 21న ఈడీకి 828 పేజీలతో వివరాలు ఇచ్చామని పేర్కొన్నారు. కోర్టులకు సమర్పించిన డిజిటల్ సాక్ష్యాల వివరాలతోపాటు.. కెల్విన్ కేసులో సేకరించిన వాట్సప్ స్క్రీన్ షాట్లు ఈడీకి ఇచ్చామని తెలిపారు.

నిందితుల నుంచి కాల్‌డేటా రికార్డులను దర్యాపు అధికారులు సేకరించలేదన్న సర్ఫరాజ్‌ అహ్మద్‌.. సిట్ సేకరించిన 12 మంది కాల్‌డేటా, వీడియో రికార్డుంగులను ఈడీకి ఇచ్చామని చెప్పారు. కేసుకు సంబంధించి కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఉల్లంఘించాలన్న ఉద్దేశం లేదన్నారు. పాలనాపరమైన కారణాలతో ఈడీకి సమాచారమివ్వడం ఆలస్యమైందని పేర్కొన్నారు.

హైకోర్టు ఆదేశాల అమలులో ఆలస్యం జరిగినందున..​ ఉన్నత న్యాయస్థానానికి ఎక్సైజ్​ డైరెక్టర్ బేషరతుగా క్షమాపణలు చెప్పారు. ఈడీ విచారణకు సహకరించేందుకు సిద్ధమని తెలిపారు. కోర్టు ధిక్కరణ పిటిషన్‌లో వాదనలకు సమయం కోరిన ఈడీ.. ఎక్సైజ్ శాఖ ఇచ్చిన వివరాలు హైకోర్టు ఆదేశాల మేరకు ఉన్నాయో లేదో పరిశీలించాలని తెలిపింది. అనంతరం విచారణను వేసవి సెలవుల తర్వాత చేపడతామని తెలంగాణ ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

ఇవీ చదవండి: రెండురోజుల క్రితం గృహప్రవేశం.. దంపతులు సజీవ దహనం.. పాపం కుమార్తె...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.