ETV Bharat / city

అటవీ సిబ్బందిని నిర్బంధించి.. దాడి చేసిన గిరిజనులు - tribals news

తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం చింతగుప్పలో అటవీ సిబ్బందిని గిరిజనులు అడ్డుకున్నారు. ఎన్నో ఏళ్లుగా పోడు భూములను సాగుచేసుకుంటున్నామని.. వాటి జోలికి వస్తే ఊరుకోమని గిరిజనులు అన్నారు.

tribals stops forests officers
అటవీ శాఖ సిబ్బందిపై దాడి
author img

By

Published : Apr 12, 2021, 5:24 PM IST

అటవీ సిబ్బందిని నిర్బంధించిన గిరిజనులు

తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉద్రిక్తత చోటుచేసుకొంది. దుమ్ముగూడెం మండలం చింతగుప్పలో అటవీ సిబ్బందిని గిరిజనులు అడ్డుకున్నారు. అటవీ భూముల్లో కందకాలు తవ్వేందుకు వెళ్లిన అధికారులను నిర్బంధించారు. సిబ్బందిని చుట్టుముట్టి చిన్న చిన్న కర్రలతో వారిపై దాడిచేశారు. అనంతరం వారిని చెట్టుకు కట్టేశారు. కాసేపు నిర్బంధించి అనంతరం వదిలేశారు. ఎన్నో ఏళ్లుగా పోడు భూములను సాగుచేసుకుంటున్నామని.. వాటి జోలికి వస్తే ఊరుకోమని గిరిజనులు హెచ్చరించారు.

అటవీ సిబ్బంది ఏమంటున్నారు..

హరితహారంలో భాగంగా చింతగుప్పలో 27 హెక్టార్ల భూమిని చదును చేస్తున్నాం. గతంలో ఒకసారి ఈ ప్రక్రియను స్థానికులు అడ్డుకున్నారు. అప్పుడు వారికి సర్దిచెప్పాం. ఇప్పుడు చదును చేసే ప్రక్రియ తుదిదశకు చేరుకొంది. ఇవాళ డీఎఫ్​వో క్షేత్రస్థాయి పర్యటన నేపథ్యంలో.. ఆయన వాహనం వెళ్లేందుకు వీలుగా రహదారిని చదును చేసేందుకు మరో వాహనాన్ని ఏర్పాటుచేశాం. దానిని నిలిపి.. డ్రైవర్​ను కొట్టారు. ఆ విషయం తెలిసి మేం ముగ్గురం అక్కడకు వెళ్లాం.. వెంటనే తమను గిరిజనులు చుట్టుముట్టి.. చెట్టుకు కట్టేసి కొట్టారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. - అటవీ సిబ్బంది.

ఇవీచూడండి:

రహదారి నిర్మాణ ప్రాజెక్టుల చెల్లింపులపై కీలక నిర్ణయం

ఆయుధాలతో బెదిరించి.. రూ.1.25 కోట్లు దోచేశారు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.