Tribal MLAs Meet Cm Jagan: గిరిజన నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు, స్థానిక సమస్యలను పరిష్కరించాలంటూ ఆయా ప్రాంతాల ఎమ్మెల్యేలు.. సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు శాసనసభలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో(cm jagan address solve the issues in the tribal areas) జగన్‌ను... డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి, గిరిజన ఎమ్మెల్యేలు పీడిక రాజన్న దొర, తెల్లం బాలరాజు, కళావతి, చెట్టి ఫాల్గుణ, భాగ్యలక్ష్మి, ధనలక్ష్మి కలిశారు. ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణానికి సంబంధించిన అంశాలు, ఎత్తైన కొండ ప్రాంతాల్లో నిర్మిస్తున్న రహదారులకు అవసరమైన అనుమతులు ఇవ్వాలని సీఎంను కోరారు.
కొండ ప్రాంతాల్లోకి వెళ్లేందుకు అవసరమైన రైస్ వ్యాన్స్, మెరుగైన ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని విన్నవించారు. షెడ్యూల్డ్ ఏరియాలో చేర్చని గ్రామాలను కూడా చేర్చడం కోసం రానున్న అసెంబ్లీ సమావేశాలలో తీర్మానం చేయనున్నట్లు సీఎం చెప్పినట్లు ఎమ్మెల్యేలు వివిరించారు. ఈ మేరకు గిరిజన ప్రాంతాల్లోని సమస్యలను పరిష్కరించే దిశగా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు.
ఇదీ చదవండి..
Amaravati Padayatra: సంకల్పం సడల లేదు..జోరు తగ్గలేదు..సమరోత్సాహంతో రైతు పాదయాత్ర