దేశ వ్యాప్తంగా శుక్రవారం నిర్వహించనున్న రవాణా బంద్‌కు లారీలు, ట్యాక్సీలు, మినీ లారీల యజమానులు, టోకు వ్యాపారులు, ముఠా కార్మిక సంఘాలు మద్దతు తెలిపాయి. డీజిల్, పెట్రోల్ ధరల తగ్గింపు, ఈ-వేబిల్లుల సమయం పెంపు, స్క్రాప్ పాలసీ, ఏటా టోల్ రేట్ల పెంపు, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్రీమియం తగ్గింపు, గ్రీన్ ట్యాక్స్ వసూలు నిలిపేయాలన్న ఆరు ప్రధాన డిమాండ్లతో ఆలిండియా ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ పిలుపు మేరకు దేశ వ్యాప్తంగా ఒక రోజు బంద్‌ను నిర్వహిస్తున్నారు. దీనికి ఏఐటీయూసీ, టీఎన్‌టీయూసీ, సీఐటీయూ వంటి కార్మిక సంఘాలు కూడా మద్దతు తెలిపాయి.
రాష్ట్ర వ్యాప్తంగా లారీ యజమానులు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొంటారు. అన్ని జిల్లాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించి జిల్లా కలెక్టర్లు, ఎంఆర్‌వోలకు వినతి పత్రాలను అందిస్తారు. కేంద్రం ప్రభుత్వ నిర్ణయాలతో రవాణా రంగం తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కుంటోందని రాష్ట్ర లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఈశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం నిర్వహిస్తున్న బంద్‌కు అన్ని వర్గాలూ సహకరించాలని కోరారు. సమ్మెకు మద్దతుగా లోడింగ్, అన్‌లోడింగ్ కార్యకలాపాల కోసం ముఠా కూలీలపై ఒత్తిడి తేవద్దని ఛాంబర్ ఆఫ్ కామర్స్ వ్యాపారులకు సూచించినట్లు తెలిపారు.
ఇదీ చదవండి: ఆన్లైన్ పరీక్షలో అక్రమాలు.. స్క్రీన్షాట్లతో జవాబులు