ETV Bharat / city

ఉగాదికి ఇళ్ల స్థలాలు.. సెప్టెంబర్ నుంచి జిల్లాల పర్యటనలు! - cm jagan

వచ్చేనెల నుంచి జిల్లాల పర్యటన చేపట్టాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. వివిధ వర్గాల ప్రజలను నేరుగా కలుసుకొని వారి సమస్యలు తెలుసుకోనున్నారు. అమెరికా పర్యటన ముగిసిన తర్వాత ఈ పర్యటన తేదిలు ఖరారు కానున్నాయి.

జగన్ జిల్లాల పర్యటన
author img

By

Published : Aug 13, 2019, 8:07 PM IST

సీఎం సమీక్ష

సచివాలయంలో అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించారు. స్పందన కార్యక్రమంపై కలెక్టర్లు, ఎస్పీలతో సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. సెప్టెంబరు నుంచి జిల్లాల్లో పర్యటించాలని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ వర్గాల ప్రజలను కలుసుకోవడమే కాక.. నేరుగా వారి సమస్యలను తెలుసుకునేందుకు వీలుగా ఈ పర్యటన చేపట్టాలని భావిస్తున్నారు.సీఎం అమెరికా పర్యటన నుంచి తిరిగి వచ్చిన అనంతరం తేదీలు ఖరారు కానున్నాయి.

ఉగాది నాటికి ఇంటి స్థలాల పంపిణీ

వచ్చే ఏడాది ఉగాది నాటికి ఇంటి స్థలాల పంపిణీకి అంతా సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. గ్రామాన్ని యూనిట్ గా తీసుకుని ఏర్పాట్లు చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. స్పందన కింద వచ్చిన వినతుల సంఖ్య పెరిగిందన్నారు. జులై 31 నాటికి లక్షా 8వేల 997 వినతులు వచ్చాయని తెలిపారు. పరిష్కారం కూడా వేగంగానే జరుగుతుండటంపై అధికారులను అభినందించారు. ఇసుక కొరత గురించి ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయని నిర్మాణాత్మకంగా ఈ సమస్యను పరిష్కరించాలని .. ఇసుక సరఫరాలో ఎక్కడా అవినీతిలేకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు.

గ్రామ వాలంటీర్ల నియామకం ఒక రికార్డు

గ్రామ వాలంటీర్ల నియామకం ఒక రికార్డని సీఎం వ్యాఖ్యానించారు. 40రోజుల వ్యవధిలోనే రెండున్నర లక్షల మందిని నియమించామని తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో లక్ష 34 వేల ఉద్యోగాలకు 22 లక్షల మంది దరఖాస్తు చేశారన్నారు. పరీక్షలు రాసే వారికి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. గ్రామ వాలంటీర్ల వ్యవస్థను ఆగస్టు 15న విజయవాడ, గుంటూరులో ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. ఆగస్టు 16 నుంచి 23 వరకూ వారికి కేటాయించిన కుటుంబాలను పరిచయం చేసుకుంటారన్నారు. సెప్టెంబరు 1 నుంచి సెప్టెంబరు 10 వరకూ బియ్యం, పెన్షన్లు ఇంటింటికి సరఫరా చేస్తామనీ.. పైలట్‌ ప్రాజెక్టుగా ప్యాక్‌ చేసిన నాణ్యమైన బియ్యం పంపిణీని శ్రీకాకుళంలో ప్రారంభిస్తున్నామని చెప్పారు. తర్వాత మిగిలిన జిల్లాల వర్తింపచేస్తామని జగన్ వివరించారు. త్వరలోనే మత్స్యకారులు, రజకులు, ఆటోడ్రైవర్లు, టైలర్లకు, నాయీ బ్రాహ్మణులకు సంబంధించిన పథకాలకు అర్హులైన వారిని వాలంటీర్లు గుర్తించే కార్యక్రమం చేపట్టనున్నట్టు సీఎం వివరించారు.

రైతు భరోసా ప్రారంభోత్సవానికి ప్రధానికి ఆహ్వానం

అక్టోబరు 15 తేదీన నిర్వహించే రైతు భరోసా కార్యక్రమ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానించినట్టు జగన్ తెలిపారు. గ్రామ సచివాలయమే కౌలు రైతులకు కార్డులు ఇస్తుందన్నారు. కౌలు రైతులకు కార్డులు అందగానే రైతు భరోసాకు అర్హులవుతారని వెల్లడించారు. ప్రస్తుతం కృష్ణా నదిలో ప్రవాహాలు రావటం భగవంతుని దయవల్లేనని... అన్ని రిజర్వాయర్లనూ నింపేలా అధికారులు శ్రద్ధపెట్టాలని సూచించారు. కృష్ణా పరీవాహక ముంపు ప్రాంతాల్లో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల కలెక్టర్లు కంటెంజెన్సీ పంట ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని చెప్పారు.

ఇదీ చదవండి

ఇన్ఫోసిస్​ సుధామూర్తి సింప్లిసిటీ చూశారా?

Intro:ఈశ్వరాచారి... గుంటూరు తూర్పు.. కంట్రిబ్యూటర్

యాంకర్...బీజేపీ రాష్ట్ర అధ్యక్షలు కన్నా లక్ష్మీనారాయణ 65వ జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిగాయి. గుంటూరు లోని ఆయన నివాసంలో ఏర్పాటుచేసిన అరవై ఐదు కేజీల కేక్ ఆయన కట్చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, పలువురు బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు మాట్లాడుతూ. నిరంతరం ప్రజా శ్రేయస్సు కొరకు పరితపించే గొప్ప మానవతావాది ప్రజా నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ అని కొనియాడారు. పార్టీ బలోపేతానికి చేస్తున్న కృషి ఎనలేనిదని తెలిపారు. ఇటువంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

Body:బైట్.....రావెల కిషోర్ బాబు.. మాజీ మంత్రి, బీజేపీ నేత

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.