ETV Bharat / city

ప్రధాన వార్తలు @9 PM

.

author img

By

Published : Jul 10, 2021, 9:00 PM IST

ప్రధాన వార్తలు @9 PM
ప్రధాన వార్తలు @9 PM
  • పెరిగిన వరద
    పోలవరం ప్రాజెక్టు(polavaram project) వద్ద గోదావరి(godavari) నీటిమట్టం పెరుగుతోంది. గోదావరి పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు వరద ప్రవాహం పెరిగింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • 'అక్రమాలు జరగలేదు'
    అల్యూమినియం(aluminium) తయారీలో వినియోగించే బాక్సైట్(bauxite), లేటరైట్(laterite) తవ్వకాల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని గనులశాఖ ముఖ్య కార్యదర్శి జి.కె.ద్వివేది(gk.dwivedi) వెల్లడించారు. అనుమతుల ప్రకారమే మైనింగ్(mining) జరుగుతోందని తెలిపారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • ఉద్ధృత పోరాటం
    విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికుల పోరాటం రోజురోజుకూ ఉద్ధృతమవుతోంది. ప్రైవేటీకరణ కోసం కేంద్రం తాజాగా తీసుకున్న చర్యలను నిరసిస్తూ..భారీ ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. కూర్మన్నపాలెం కూడలి నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ఉద్యోగులు, అఖిలపక్ష కార్మిక నాయకులు ర్యాలీలో పాల్గొన్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • తగ్గుదల
    రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 95,366 పరీక్షలు నిర్వహించగా.. 2,925 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 19,20,178 మంది వైరస్‌ బారిన పడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • భారీ జరిమానా!
    శబ్దకాలుష్యానికి చెక్​ పెట్టేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వేడుకలకు, సమావేశాలకు నిబంధనలు ఉల్లంఘించి లౌడ్​ స్పీకర్లను ఉపయోగిస్తే రూ. లక్ష వరకు జరిమానా విధించనున్నట్లు దిల్లీ సర్కారు స్పష్టం చేసింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • ఎగరనున్న తెలుగు కీర్తి పతాక
    విశ్వవినువీధిలో తెలుగు కీర్తిపతాకం ఎగరబోతోంది. రోదసిపై తొలిసారి ఒక తెలుగు మహిళ అడుగుపెట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్‌ గుంటూరు జిల్లాకు చెందిన బండ్ల శిరీష ఈ ఘనత సాధించనున్నారు. కల్పనాచావ్లా, సునీత విలియమ్స్‌ తర్వాత రోదసీయానం చేయనున్న భారత సంతతి మహిళగా శిరీష చరిత్ర పుటలకెక్కనున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • తాలిబన్ల ఏరివేత
    అఫ్గానిస్థాన్​లో 109 మంది తాలిబన్లు భద్రతా దళాల చేతిలో హతమయ్యారు. మరో 25 మంది గాయపడ్డారు. రెండు రాష్ట్రాల్లో జరిగిన భద్రతా బలగాలకు, తాలిబన్లకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • 'కొవాగ్జిన్‌'పై 4-6 వారాల్లో నిర్ణయం!
    భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకా​పై డబ్ల్యూహెచ్​ఓ ప్రధాన శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్​ కీలక వ్యాఖ్యలు చేశారు. కొవాగ్జిన్​ను అత్యవసర వినియోగ వ్యాక్సిన్​ల జాబితాలో చేర్చే అంశంపై 4-6 వారాల్లో నిర్ణయం తీసుకోనున్నట్లు వివరించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • ప్రశంసల వెల్లువ
    ఇంగ్లాండ్​తో జరిగిన తొలి టీ20లో కనీవినీ ఎరగని రీతిలో క్యాచ్‌ పట్టుకుని సామాన్యుల నుంచి దిగ్గజాల వరకు అందరీ దృష్టినీ ఆకర్షించింది టీమ్‌ఇండియా యువ క్రికెటర్‌ హర్లీన్‌ డియోల్‌(Harleen Deol). ఈ క్రమంలో వీరంతా ఆమెపై సామాజిక మాధ్యమాల వేదికగా ప్రశంసిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. ఇంతకీ ఎవరెవరు ఏమన్నారంటే? పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • కత్తి మహేశ్‌ కన్నుమూత
    సినీ నటుడు, విశ్లేషకుడు కత్తి మహేశ్‌ కన్నుమూశారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. తల, శరీరంపై తీవ్ర గాయాలు అవడంతో వైద్యులు శస్త్రచికిత్స చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.