- బస్సు ప్రమాదంపై నేతల తీవ్ర దిగ్భ్రాంతి.. ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి
CONDOLENCES ON BUS ACCIDENT: పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన బస్సు ప్రమాద ఘటనపై రాజకీయ ప్రముఖులు తమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఇటువంటి ప్రమాదాలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Amaravati Farmers Meeting: తిరుపతిలో అమరావతి రైతుల సభకు హైకోర్టు అనుమతి
Amaravati Farmers Meeting: చిత్తూరు జిల్లా తిరుపతిలో ఈ నెల 17న అమరావతి రైతుల తలపెట్టిన బహిరంగ సభకు ఏపీ హైకోర్టు అనుమతి ఇచ్చింది. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు సభ నిర్వహించుకోవాలని స్పష్టం చేసింది. కరోనా నిబంధనలు పాటిస్తూ సభ నిర్వహించుకోవాలని రైతులకు సూచించింది. రాయలసీమ ఐక్య వేదిక సభను.. మరుసటిరోజు 18న నిర్వహించుకోవాలని ఉన్నత న్యాయస్థానం సూచించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Ramoji Foundation : రామోజీ ఫౌండేషన్ మరో ముందడుగు...పంచాయతీ కార్యాలయ భవన నిర్మాణం..
Ramoji Foundation: సామాజిక బాధ్యతలో భాగంగా రామోజీ ఫౌండేషన్ మరో ముందడుగు వేసింది. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా నాగన్‌పల్లిలో పంచాయతీ కార్యాలయ భవనాన్ని నిర్మించింది. ఈ భవనాన్ని రామోజీ ఫిలింసిటీ ఎండీ విజయేశ్వరి ప్రారంభించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- AP Corona Cases: రాష్ట్రంలో కొత్తగా 163 కరోనా కేసులు, ముగ్గురు మృతి
AP Corona Cases: రాష్ట్రంలో కొత్తగా 163 కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌తో ముగ్గురు మృతి చెందారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఏడేళ్ల చిన్నారికి ఒమిక్రాన్.. 60కి చేరిన బాధితుల సంఖ్య
Omcron Case In Bengal: దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ క్రమంగా విస్తరిస్తోంది. తాజాగా బంగాల్లో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. ఏడేళ్ల బాలుడికి ఒమిక్రాన్ నిర్ధరణ అయినట్లు అధికారులు తెలిపారు. దీంతో దేశంలో మొత్తం బాధితుల సంఖ్య 60కి చేరింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- యూపీలో 'సరిలేరు నీకెవ్వరు' సీన్.. జవాన్లే పెళ్లి పెద్దలు
CRPF soldiers in marriage: ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో సరిలేరు నీకెవ్వరు సీన్ కనిపించింది. ఓ అమర జవాను సోదరి పెళ్లికి సహచర సైనికులు హాజరై వివాహ తంతును పూర్తి చేశారు. పెళ్లి పెద్దలుగా మారి అన్న లేని లోటును తీర్చారు. యూనిఫామ్‌లో సైనికులు పెళ్లి పనులు చేస్తుంటే.. బంధువుల కళ్లల్లో నీళ్లు తిరిగాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కశ్మీర్లో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హతం
Jammu Kashmir encounter: కశ్మీర్లో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిని మట్టుబెట్టాయి భద్రతా దళాలు. అతడ్ని.. పోలీసులు, పౌరులపై పలు దాడులు చేసిన హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాది ఫిరోజ్ అహ్మద్‌గా గుర్తించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- వాట్సాప్ నుంచే జియో రీఛార్జ్.. నిత్యావసరాల కొనుగోలు కూడా!
Jio Prepaid Recharge Through Whatsapp: వాట్సాప్ ద్వారా జియో ప్రీపెయిడ్ రీఛార్జ్ చేసుకునే సౌకర్యం త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఇందుకోసం ఫేస్బుక్ మాతృ సంస్థ మెటాతో జట్టుకట్టింది జియో. మరోవైపు.. వాట్సాప్ ద్వారా కిరాణా సరకులు కొనుగోలు చేసేందుకు వీలు కల్పించే జియోమార్ట్ సేవలను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొచ్చింది రిలయన్స్. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Jadeja Test Retirement: టెస్టు రిటైర్మెంట్పై జడేజా క్లారిటీ
Jadeja Test Retirement: టీమ్ఇండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా టెస్టు జట్టుకు వీడ్కోలు పలకనున్నాడని వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించాడు జడ్డూ. ఇప్పుడప్పుడే టెస్టు జట్టును వీడనని పరోక్షంగా చెబుతూ ట్వీట్ చేశాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఓటీటీలో 'కురుప్' సినిమా.. సుశాంత్ 'చిచ్చోరే' చైనాలో రిలీజ్
Cinema news: సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో కురుప్, చిచ్చోరే, బ్రహ్మస్త్ర, హ్యాపీ బర్త్‌డే చిత్రాల కొత్త సంగతులు ఉన్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.