- 15న నరసరావుపేటలో కామధేను పూజ... పాల్గొననున్న సీఎం జగన్
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 15న గుంటూరు జిల్లా నరసరావుపేటలో పర్యటించనున్నారు. తితిదే ఆధ్వర్యంలో జరగనున్న కామధేను పూజ కార్యక్రమంలో పాల్గొంటారు. కార్యక్రమ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ బుధవారం పరిశీలించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పట్టణాలు, నగరాల్లో ఇళ్ల స్థలాల భూసేకరణకు ప్రభుత్వ కమిటీ
పట్టణాలు, నగరాల్లో అందుబాటు ధరల్లో ఇళ్ళ స్థలాలకు అవసరమైన భూ సేకరణకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ప్రభుత్వం నియమించింది. ఈ నెల 21 లోగా నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రామతీర్థం ఘటనపై జనసేన కమిటీ ఏర్పాటు
రామతీర్థం ఘటనపై జనసేన అధ్యక్షుడు పవన్.. నలుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. టి. శివశంకర్ ఆ కమిటీకి నేతృత్వం వహించనుండగా..భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో సమన్వయంతో ఈ కమిటీ పని చేయనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పందెం కోళ్లకు బ్రహ్మచర్యం తప్పదా?!
పౌరుషానికి ప్రతిరూపాలు పందెంకోళ్లు.. కత్తికట్టి బరిలోకి దించితే.. యజమాని పరువు కోసం.. ప్రాణాలు పణంగా పెట్టి.. కొట్లాడుతుంది. ఇక సంక్రాంతి అంటే.. కోళ్ల కొట్లాట కాదు... కోట్లాటే.! ఢీ అంటే ఢీ అనే కోడి పుంజులకు గిరాకీ ఎక్కువ. అందులోనూ చాలా రకాలుంటాయి. మరివాటిని ఎలా గుర్తించాలి.? ఎలా పెంచాలి? ఏం తినిపించాలి.? ఏ ముహూర్తాన ఏ కోడి గెలుస్తుంది? పందెం రాయుళ్లు విశ్వసించే కోడిశాస్త్రం ఏం చెప్తోంది? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'ఛాయ్‌వాలా' పద్మశ్రీ ప్రకాశ్ రావు కన్నుమూత
పద్మశ్రీ గ్రహీత ప్రకాశ్ రావు కన్నుమూశారు. ఒడిశాలోని కటక్‌కు చెందిన ఆయన.. ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 83 తేజస్ ఫైటర్ జెట్ల తయారీకి భారత్ సిద్ధం
భద్రతా వ్యవహారాలపై ఏర్పాటైన కేబినెట్ కమిటీ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. రూ. 48,000 కోట్లతో తేజస్ ఫైటర్ జెట్లు సమకూర్చాలని నిర్ణయించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మొదటి స్వదేశీ మెషీన్ గన్ అభివృద్ధి
రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ), భారత సైన్యం సంయుక్తంగా మొదటి స్వదేశీ మెషీన్ గన్ను అభివృద్ధి చేశాయి. భద్రతా బలగాలు ప్రస్తుతం వాడుతున్న 9ఎంఎం పిస్టల్‌కు బదులు.. కొత్తగా అభివృద్ధి చేసిన గన్ను వినియోగించే అవకాశాలున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- అభిశంసన 2.0: ట్రంప్ గట్టెక్కుతారా?
అమెరికా ప్రతినిధుల సభలో అధ్యక్షుడు ట్రంప్‌పై అభిశంసన అస్త్రాన్ని డెమొక్రాట్లు బుధవారం ప్రయోగించే అవకాశముంది. ఇదే జరిగితే పదవీకాలంలో రెెండోసారి అభిశంసన ఎదుర్కొన్న తొలి అధ్యక్షుడిగా అమెరికా చరిత్రలో నిలిచిపోనున్నారు ట్రంప్. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- విరుష్క జోడీ విన్నపం: పాప ఫొటోలు తీయొద్దు
తమ పాప ఫొటోలను తీయొద్దని విరాట్-అనుష్క దంపతులు కోరారు. ఈ మేరకు చిన్నారి గోప్యతకు భంగం కలిగించొద్దని చెబుతూ ఓ లేఖ విడుదల చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మనిద్దరి మధ్య ప్రేమ ఎందుకని..
రొమాంటిక్ డ్రామా 'ఉప్పెన' టీజర్.. సంక్రాంతి కానుకగా విడుదలైంది. హీరోహీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ, నేపథ్య సంగీతం సినిమాపై అంచనాల్ని పెంచేస్తున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.