- పవన్ కల్యాణ్ పర్యటనకు అనుమతి లేదు
తూర్పుగోదావరి జిల్లాలో దివిస్ పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ తలపెట్టిన పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు. ఆయన పర్యటనకు అనుమతి లేదని జిల్లా నయీమ్ అస్మీ వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఎన్నికల ఏర్పాట్లు చేయాలన్న ఎస్‌ఈసీ...
ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌తో ప్రభుత్వ ప్రతినిధుల బృందం భేటీ అయ్యింది. విజయవాడ ఎస్‌ఈసీ కార్యాలయంలో గంటన్నరపాటు చర్చలు జరిగాయి. ఫిబ్రవరిలో ఎన్నికలు జరపాల్సిన అవసరాన్ని సీఎస్ ఆధిత్యనాథ్‌కు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వివరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రాష్ట్రంలో కొత్తగా 319 కరోనా కేసులు, ఒకరు మృతి
రాష్ట్రంలో కొత్తగా 319 మందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కరోనా బాధితుల సంఖ్య 8,84,490కు చేరింది. కొత్తగా 410 మంది కోలుకోగా.. ప్రస్తుతం 3,423 మంది చికిత్స పొందుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'భాజపా కన్నెర్ర చేస్తే... ప్రాంతీయ పార్టీలు అడ్రెస్ లేకుండా పోతాయ్'
ఏపీలో హిందూ ఆలయాలపైన దాడులు పెరిగిపోయాయని భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. ప్రభుత్వం ఆకతాయిల పనిగా ప్రచారం చేసి.. చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. రామతీర్థంలో రాముని తల తొలగిస్తే ప్రజలు ఆవేదన చెందారని.. కానీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- గుడిలో 40 ఏళ్ల మహిళపై గ్యాంగ్ రెేప్
యూపీ బదాయూలో జరిగిన పాశవిక ఘటన మరువక ముందే తమిళనాడులో అలాంటి ఘటనే వెలుగు చూసింది. నాగపట్టిణంలో 40 ఏళ్ల మహిళను గుడిలోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారం చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'సాగు చట్టాలు రద్దు చేస్తేనే ఇంటికి..'
కేంద్రం, రైతుల మధ్య ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. 8వ విడత చర్చల్లోనూ ఎలాంటి ఫలితం తేలలేదు. జనవరి 15న మరోసారి భేటీ కావాలని ఇరు వర్గాలు నిర్ణయించాయి. అంతకుముందు.. చర్చల్లో హైడ్రామా నెలకొంది. రైతులు కేంద్రానికి అల్టిమేటం విధించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మోడెర్నా టీకాకు బ్రిటన్ ఓకే
బ్రిటన్‌లో మరో కొవిడ్ టీకాకు ఆమోదం లభించింది. మోడెర్నా టీకా అత్యవసర వినియోగానికి ఆ దేశ ఔషధ నియంత్రణ సంస్థ పచ్చజెండా ఊపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
బంగారం ధర శుక్రవారం భారీ స్థాయిలో తగ్గింది. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.614 క్షీణించి.. 50వేల దిగువకు చేరింది. వెండి రేటు కూడా అదే స్థాయిలో పతనమై.. రూ.67,518కు చేరింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఆ వార్తలు విన్నాక నవ్వొచ్చింది: స్మిత్
టీమ్ఇండియాతో జరిగిన రెండు టెస్టుల్లో పరుగులేవి చేయలేకపోయినా.. మూడో టెస్టు రాణించడం చాలా ఆనందాన్నిచ్చిందని అన్నాడు ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ స్టీవ్‌స్మిత్. తాను ఫామ్‌లో లేనని వస్తున్న వార్తలు వింటుంటే నవ్వు వస్తుందని మ్యాచ్ అనంతర ఇంటర్వ్యూలో వెల్లడించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'మాస్టర్' టీమ్ డ్యాన్సులు
కొత్త సినిమా అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో 'సమ్మతమే', నిహారిక నటించనున్న కొత్త వెబ్ సిరీస్, 'మాస్టర్' ప్రీ రిలీజ్ ఈవెంట్, మాధవన్ బాలీవుడ్ చిత్రానికి సంబంధించిన సంగతులు ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.