- ఇంకా అందని బెయిల్ పత్రాలు.. ఎంపీ రఘురామ సోమవారం విడుదలయ్యే అవకాశం!
నరసాపురం ఎంపీ రఘురామ.. బెయిల్పై సోమవారం విడుదలయ్యే అవకాశం ఉంది. సుప్రీం కోర్టు మంజూరు చేసిన బెయిల్ ఆదేశాలు రఘురామ న్యాయవాదులకు ఇంకా చేరనందున.. ప్రక్రియ ఆలస్యమవుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ప్రభుత్వం హెచ్చరికలు పట్టవా?... ప్రైవేటు ఆసుపత్రులు దోపిడీ ఆపవా?
కరోనా చికిత్స విషయంలో ప్రభుత్వం ఎంత హెచ్చరిస్తున్నా.. ప్రైవేటు ఆసుపత్రులు వాటి దందాను ఆపడం లేదు. రోగుల అవసరాన్నే అదునుగా చేసుకొని లక్షల రూపాయల డబ్బులు దోచుకుంటున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'దొంగ తీర్మానాలు, దిల్లీ పాదసేవలు మానండి.. చిత్తశుద్ధితో పోరాడండి'
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 'దొంగ తీర్మానాలు, దిల్లీ పాదసేవలు' మాని.. చిత్తశుద్ధితో పోరాడాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఆంధ్రా యూనివర్సిటీ మాజీ వీసీ ఆచార్య సింహాద్రి కన్నుమూత
ఆంధ్రా యూనివర్సిటీ మాజీ వీసీ ఆచార్య వై. సింహాద్రి విశాఖలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కరోనాతో మృతి చెందారు. బెనారస్, పాట్నా, యూనివర్సిటీలకు సైతం ఉపకులపతిగా ఆయన సేవలు అందించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'దేశంలో 80% పల్లెలు వైద్యానికి దూరం'
దేశానికి పల్లెటూళ్లే పట్టుకొమ్మలని ప్రభుత్వాలు గొంతెత్తి చెబుతున్నా.. వాస్తవరూపం దాల్చడం లేదు. మిషన్ అంత్యోదయ చేపట్టిన ఈ సర్వే ద్వారా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కిడ్నాపైన ఓఎన్జీసీ అధికారి విడుదల
ఏప్రిల్ 21న అపహరించిన ఓఎన్జీసీ అధికారిని ఉల్ఫా ఉగ్రవాద సంస్థ విడుదల చేసింది. మయన్మార్ సరిహద్దులో అతన్ని వదిలేసినట్లు అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'టిబెట్' ముసుగులో.. సరిహద్దుల్లో డ్రాగన్ విస్తరణ
టిబెట్లో మౌలిక వసతుల విస్తరణ ముసుగులో.. చైనా వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. భారత్లోని అరుణాచల్ ప్రదేశ్తో పాటు నేపాల్, భూటాన్ భూభాగాలకు చేరువయ్యేందుకు యత్నిస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- '2020లో 81% భారతీయ కంపెనీల డేటా చోరీ'
గతేడాది 81 శాతం భారతీయ సంస్థల్లో డేటా చోరీ జరిగిందని ఓ అంతర్జాతీయ సర్వే వెల్లడించింది. అందుకు భద్రతా లోపాలు ప్రధాన కారణమని తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- '148 మంది అథ్లెట్లకు టీకా.. 17 మందికి రెండు డోసులు'
దేశంలో ఇప్పటివరకు 148 మంది అథ్లెట్లు (అన్ని క్రీడలతో కలిపి) టీకాలు వేసుకున్నారని తెలిపారు భారత ఒలింపిక్ సమాఖ్య అధ్యక్షుడు నరేందర్ బత్రా. పారా ఒలింపిక్స్ ఆటగాళ్లతో కలిసి ఈ సంఖ్య 163 అని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'ఆదిపురుష్' కోసం ప్రభాస్ డైట్ ఏంటంటే?
'ఆదిపురుష్'లో ప్రభాస్(రాముడు), తన(లక్ష్మణుడు) పాత్రల కోసం ఎలాంటి డైట్ పాటిస్తున్నారో తెలిపాడు నటుడు సన్నీ సింగ్. పాత్రలకు తగ్గట్లు శరీరాకృతిని మార్చుకునేందుకు ఎలాంటి స్టెరాయిడ్స్ తీసుకోవట్లేదని చెప్పాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.