- పోలవరం ఏమైనా నిషిద్ధ ప్రాంతమా?: చంద్రబాబు
పోలవరం ప్రాజెక్టు సందర్శనకు బయల్దేరిన సీపీఐ నాయకుల నిర్బంధాలను తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఖండించారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలపై అణిచివేత వైఖరి గర్హనీయమని ఆక్షేపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'పోలవరం సందర్శిస్తే ప్రభుత్వానికి వచ్చే నష్టమేంటి?'
ప్రభుత్వం తీరుపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. పోలవరం సందర్శించేందుకు బయలుదేరిన సీపీఐ నేతలను పోలీసులు గృహనిర్భంధం చేయడాన్ని తప్పుబట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'పోలవరాన్ని ఉద్ధరించామంటున్నారుగా.. మరి ఈ నిర్బంధాలు ఎందుకు?'
పోలవరం సందర్శిస్తున్నారంటే వైకాపా ప్రభుత్వానికి అంత భయం ఎందుకని తెదేపా నేత అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికే అక్రమ అరెస్టులు, నిర్బంధాలు చేస్తున్నారని విమర్శించారు. సీపీఐ నేతల గృహ నిర్బంధాలను ఖండించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఉద్యానవనాల్లో జనం సందడి
ఉల్లాసంగా ఉత్సాహంగా ఉరకలెత్తే ఆనందంతో.. ఉద్యానవనాల్లో విశాఖవాసులు సందడి చేస్తున్నారు. మహమ్మారి తెచ్చిన నిస్తేజాన్ని దూరం చేస్తూ.. సరికొత్త ఉత్తేజంతో ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు. నెలల తరబడి పచ్చని పూతోటలకు దూరంగా గడిపిన కాలాన్ని మరపించేలా.. విశాఖలోని వీఎంఆర్డీఏ హెల్త్ ఎరెనాలో రంగుల హరివిల్లును తలపించేలా ఆనందం వెల్లివిరిసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- భలే ఐడియా: పాత సీసాలతో టాయిలెట్లు
లాక్డౌన్ కాలంలో కొవిడ్ రోగుల కోసం వాటర్ బాటిళ్లను పంపిణీ చేశాయి స్వచ్ఛంద సంస్థలు. దీంతో వాడి పడేసిన బాటిళ్లు కుప్పలు తెప్పలుగా పోగయ్యాయి. అయితే అవి పర్యావరణానికి హాని కలిగించకుండా చూసేందుకు వినూత్నంగా ఆలోచించారు తమిళనాడులోని తూత్తుకుడి నగరపాలక సంస్థ అధికారులు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఇది ఖైదీల 'ఫ్రీడమ్' బ్యూటీ పార్లర్ గురూ!
'ఫ్రీడమ్' కేరళలో ఈ పేరు ఇప్పుడు చాలా ఫేమస్. ఈ బ్రాండ్ పేరుతో ప్రజల కోసం ఎన్నో రకాల ఉత్పత్తులను, సేవలను అందుబాటులోకి తెచ్చారు ఇక్కడి ఖైదీలు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి బ్యూటీ పార్లర్ సేవలను అందిస్తున్నారు. ఆ విశేషాలేంటో తెలుసుకోవాలంటే ఈ కథనంలోకి వెళ్లాల్సిందే! పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'ప్రతి ఇంటికి తాగు నీరు అందించడమే లక్ష్యం'
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీర్జాపుర్, సోన్‌భద్ర జిల్లాల్లో రెండు తాగునీటి సరఫరా ప్రాజెక్టులను ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోదీ. దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కొన్ని దశాబ్దాల పాటు యూపీలోని కొన్ని ప్రాంతాలు నిర్లక్ష్యానికి గురయ్యాయని ఈ సందర్భంగా మోదీ అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- టీకా వార్తలే ఈ వారం మార్కెట్‌కు కీలకం!
ఓ వైపు కరోనా కేసుల్లో పెరుగుదల, మరోవైపు వ్యాక్సిన్‌పై అంచనాలే ఈ వారం దేశీయ మర్కెట్లకు దిశా నిర్దేశం చేయనున్నాయి. ఈ నేపథ్యంలో మార్కెట్లు ఒడుదొడుకులకు లోనవుతాయని విశ్లేషకులు చెబుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఏటీపీ టోర్నీలో నాదల్ ఓటమి.. ఫైనల్లో కుర్రాళ్లు
ఏటీపీ టెన్నిస్ టోర్నీలో స్టార్ ప్లేయర్లను ఓడించిన కుర్రాళ్లు మెద్వదేవ్, థీమ్ తుదిపోరుకు అర్హత సాధించారు. మరి ఎవరు విజేతగా నిలుస్తారో చూడాలి? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'మిడిల్ క్లాస్ మెలొడీస్' ఆలోచన అలా!
తమ జీవితాల్లో చూసిన కథలతోనే 'మిడిల్ క్లాస్ మెలొడీస్' సినిమా తీశానని యువ దర్శకుడు వినోద్ అనంతోజు చెప్పారు. ఇటీవలే 'అమెజాన్ ప్రైమ్'లో విడుదలైన ఈ చిత్రం.. ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.