- జీహెచ్‌ఎంసీ ఫలితాలు: పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో భాజపా ముందంజ
జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఆర్వో టేబుల్ వద్ద పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తున్నారు. కొన్నిచోట్ల పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తి కాగా.. బ్యాలెట్ పత్రాల లెక్కింపు మొదలైంది. పోస్టల్ ఓట్లలో 81 స్థానాల్లో భాజపా, 31 స్థానాల్లో తెరాస.. ఎంఐఎం 16, కాంగ్రెస్ 4 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- జేఈఈ, నీట్ సిలబస్‌పై విద్యార్థుల్లో ఆందోళన
జేఈఈ మెయిన్స్, నీట్ సిలబస్‌పై.... విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. ఈ ఏడాది సిలబస్‌ను తగ్గిస్తారా... యాథావిధిగా ఉంచుతారా అనే అంశంపై... సందిగ్ధత కొనసాగుతోంది. ఇంటర్‌లో 30 శాతం సిలబస్ తగ్గించినందువల్ల... పోటీ పరీక్షల్లోనూ అలా చేయకుంటే.... విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మండలిలో వీగిపోయిన వ్యాట్ సవరణ, వృత్తి పన్ను విధింపు బిల్లులు
శాసనమండలిలో రాష్ట్ర ప్రభుత్వానికి మరో మారు ఎదురుదెబ్బ తగిలింది. ఒకే రోజు ఏకంగా నాలుగు బిల్లులను మండలి తిరస్కరించినట్టు పీటీఐ కథనం వెల్లడించింది. వీటిలో మూడింటిపై ఓటింగ్ నిర్వహించగా వీగిపోయాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- దేశంలో కొత్తగా 36,594 కరోనా కేసులు
దేశంలో కరోనా ఉద్ధృతి కాస్త తగ్గింది. గురువారం కొత్తగా 36,594 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 540 మంది ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కరోనాపై ప్రధాని అధ్యక్షతన అఖిలపక్ష భేటీ
పార్లమెంటు ఉభయసభల్లోని అన్ని పార్టీల నేతలతో నేడు అఖిల ఫక్ష సమావేశం నిర్వహించునున్నారు. ప్రధాని అధ్యక్షతన దృశ్య, శ్రవణ మాధ్యమం ద్వారా సమావేశం భేటీలో పాల్గొననున్న లోక్‌సభ, రాజ్యసభల్లోని అన్ని పార్టీల నేతలు పాల్గొననున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కొవిడ్‌తో మారిన వైద్యం తీరు- ఇంటి చికిత్సకు జై!
కరోనా వల్ల వైద్యం తీరు మారిపోయింది. తప్పనిసరి అయితే తప్పా బయటకు వచ్చే పరిస్థితే లేదు. టెలీ మెడిసిన్ ప్రాధాన్యం పెరిగింది. సంప్రదింపులన్నీ ఫోన్లోనే.. మరి ఇలాంటి సమయంలో సమస్య కచ్చితంగా చెబితేనే వైద్యులు సరైన సలహాలు, సూచనలు ఇవ్వగలరు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- చీఫ్ మెడికల్ అడ్వైజర్‌గా ఫౌచీ కొనసాగింపు: బైడెన్
అమెరికా ప్రధాన ఆరోగ్య సలహాదారు(చీఫ్ మెడికల్ అడ్వైజర్)గా ప్రముఖ అంటువ్యాధుల నిపుణులు డాక్టర్ ఆంథోనీ ఫౌచీని కొనసాగిస్తున్నట్లు చెప్పారు అధ్యక్ష ఎన్నికల విజేత జో బైడెన్. తన కొవిడ్-19 సలహా బృందంలోనూ సభ్యులుగా ఉంటారని చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కీలక వడ్డీ రేట్లు యథాతథం: ఆర్బీఐ
కీలక వడ్డీ రేట్లను మరోసారి యథాతథంగా ఉంచుతూ నిర్ణయం తీసుకుంది ఆర్బీఐ. ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమీక్షలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఆసీస్‌తో టీ20 పోరుకు ముందు కేఫ్‌లో భారత ఆటగాళ్లు
ఆస్ట్రేలియాతో టీ20 పోరుకు ముందు భారత ఆటగాళ్లు సరదాగా అలా కేఫ్‌లో కనిపించారు. ఆ సమయంలో దిగిన ఫొటోను ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- చరణ్ సరసన రష్మిక నటించనుందా?
మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 'ఆచార్య' సినిమాలో రామ్ చరణ్ అతిథి పాత్రలో కనిపించనున్నారు. తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో చరణ్ సరసన రష్మిక నటించనుందట. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.