ETV Bharat / city

కృష్ణా నది మధ్యలో.. కొత్త 'దారి'దోపిడీ - కృష్ణా జిల్లాలో టోల్ గేట్ రేట్లు

Toll Mafia: వారి ఆలోచన ఎప్పుడూ అక్రమ సంపాదనపైనే.. ఆలోచన వచ్చిందే ఆలస్యం రంగంలోకి దిగిపోతారు.. ఎలా దోచుకోవాలో పథకాలు రచిస్తారు.. ఇన్నాళ్లూ భూములు, ఇతర మార్గాల్లో అక్రమాలకు తెరలేపిన వాళ్లు.. ఇప్పుడు మాత్రం కొత్తగా ఆలోచించారు. ఎవరూహించని విధంగా కృష్ణానదిలో దారి వేసి.. వసూళ్లకు పాల్పడుతున్నారు. మంచి లాభాలు రావడంతో అక్రమార్కులంతా సిండికేట్​గా మారారు. కృష్ణా నదిలో టోల్‌ వసూళ్లపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.

Toll mafia in Krishna district
Toll mafia in Krishna district
author img

By

Published : Jun 2, 2022, 1:37 PM IST

దోపిడీకి కొత్త 'దారి'...కృష్ణా నది మధ్యలో వసూళ్లు...

Toll Mafia in Krishna River: సరిహద్దులు కొందరికి సమస్యలు తెచ్చిపెడితే, మరికొందరికి సిరులు కురిపిస్తున్నాయి. కృష్ణా జిల్లా ఘంటసాల మండలం శ్రీకాకుళం నుంచి కృష్ణా నది మీదుగా.. బాపట్ల జిల్లా కొల్లూరు మండలం, గాజుల్లంక వరకు ఎలాంటి అనుమతులు లేకుడా నదిలో తూములు ఏర్పాటు చేశారు. ఇసుక, బుసకను బాటలా చేసి అక్కడక్కడా కంకర పరిచి బాట వేశారు. కృష్ణా నది అవతల వైపు నుంచి ఇటుపక్కకు రావడానికి వాహనానికోరకంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. బైక్‌కు రూ.20, ఆటోకు రూ.50, కారుకు రూ.100, లారీకి రూ.200, పెద్ద టిప్పర్‌కు రూ.300 గా ధరలు నిర్ణయించి, ఎలాంటి రశీదు ఇవ్వకుండానే డబ్బులు వసూలు చేస్తున్నారు. రోజూ సుమారు 500 వరకు వివిధ రకాల వాహనాలు ఈ దారిపై వెళ్తున్నాయి. దారి వేసినందుకు, రోజూ బాటపై నీరు చల్లుతున్నందుకు... చాలా ఖర్చు అవుతుందని నిర్వాహకులు అంటున్నారు.

అయితే... బాటపై వెళ్లి నదిని దాటినవారు, తిరిగి వచ్చేటప్పుడూ డబ్బులు చెల్లించాల్సిందే. డబ్బులు ఇవ్వకుండా తిరిగి వస్తుంటే.. అక్కడవరకు వచ్చినందుకు డబ్బులు చెల్లించి వెనక్కి వెళ్లాలంటూ.. చాలా మందిపై దౌర్జన్యం చేసినట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. జాతీయ హరిత ట్రైబ్యునల్‌ ప్రకారం... నదీ ప్రవాహానికి ఎలాంటి అడ్డంకులు ఏర్పరచకూడదని ఆదేశాలు ఉన్నప్పటికీ... స్థానిక రివర్స్‌ కన్జర్వేటర్‌ అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. అడ్డుకోవాల్సిన అధికారులు చూస్తూ ఉండిపోతున్నారు. పులిగడ్డ-పెనుమూడి వారధిపై నుంచి వెళ్తే.. టోల్‌ చెల్లించాల్సి రావడంతో ఎక్కువ మంది ఈ రోడ్డుపై ప్రయాణాలు సాగిస్తున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల సరిహద్దు కావడం.. పైగా ఈ బాటపై స్థానిక పోలీసులు, అధికారుల నిఘా లేకపోవడంతో గంజాయి, నాటుసారా వాహనాలు వెళ్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.

డబ్బులు వసూలు చేస్తున్న పాక ఉన్న ప్రదేశం తమ పరిధిలోకి రాదని.. కృష్ణా జిల్లా సరిహద్దు అవతల గుంటూరు జిల్లాలో డబ్బులు వసూలు చేస్తున్నారని ఘంటసాల పోలీసులు చెబుతున్నారు. రెండు జిల్లాల రెవెన్యూ, పోలీసు అధికారులు... ఈ అక్రమ వసూళ్లు నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.