ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 5PM - తెలుగు ప్రధాన వార్తలు

.

ప్రధాన వార్తలు@5PM
ప్రధాన వార్తలు@5PM
author img

By

Published : Aug 25, 2020, 4:59 PM IST

  • వరద బాధితులకు రూ.2 వేలు సాయం
    వరద బాధితులకు సాయం అందేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. సెప్టెంబరు 7 నాటికి బాధితులకు రూ.2వేలు సాయం అందేలా చూడాలని స్పష్టం చేశారు. అదనంగా నిత్యావసరాలను పంపిణీ చేయాలని సూచించారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • అనుమతులిచ్చిన అధికారులను ఈ కేసులో ఎందుకు చేర్చొద్దు?: హైకోర్టు
    స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద ఘటనలో రమేష్ ఆసుపత్రి ఎండీ డా. రమేష్ బాబు, ఛైర్మన్ సీతారామమోహన్​లకు హైకోర్టులో ఊరట లభించింది. అగ్నిప్రమాద ఘటనలో తమపై పెట్టిన కేసును ఎత్తివేయాలని కోరుతూ ఎండీ, ఛైర్మన్​ వేర్వేరుగా దాఖలు చేసిన క్వాష్ పిటిషన్లతో తదుపరి చర్యలను నిలువరిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • మృతదేహం అప్పగింతకు లంచం డిమాండ్‌ చేసిన కామాటి సస్పెన్షన్‌
    మచిలీపట్నం జిల్లా ఆసుపత్రిలో మృతదేహం అప్పగించేందుకు లంచం డిమాండ్‌ చేసిన కామాటిపై సస్పెన్షన్ వేటు పడింది. అశ్వనీకుమార్​ను సస్పెండ్ చేస్తూ జిల్లా పాలనాధికారి నిర్ణయం తీసుకున్నారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • కూలిన ఆ భవనంలో నాలుగేళ్ల బాలుడు సేఫ్​
    మహారాష్ట్రలోని రాయ్​గఢ్​ జిల్లా మహద్​ ప్రాంతంలో సోమవారం కూలిన ఐదంతస్తుల భవనం శిథిలాల కింద చిక్కుకున్న ఓ నాలుగేళ్ల చిన్నారిని సహాయక సిబ్బంది కాపాడారు. గాయాలైన అతడిని సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. ఇంత ప్రమాదం జరిగినా శిథిలాల కింద పడి ప్రాణాలతో బయటపడిన అతడిని కారణజన్ముడిగా అభివర్ణిస్తున్నారు స్థానికులు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • పుల్వామా ఉగ్రదాడి కేసులో ఎన్​ఐఏ ఛార్జిషీటు
    పుల్వామా ఉగ్రదాడి కేసులో 18 నెలల తర్వాత జాతీయ దర్యాప్తు సంస్థ ఛార్జిషీటు దాఖలు చేసింది. ఇందులో జైషే మహ్మద్​ అధినేత మసూద్​ అజర్​ సహా 19 మంది పేర్లు ప్రస్తావించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'ఆరు నెలల్లో 175 వాయు నాణ్యత కేంద్రాలు!'
    జాతీయ శుద్ధ వాయు కార్యక్రమానికి సంబంధించి కేంద్రం తీరుపై జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కొంత పరిమితికి మించి కాలుష్యాన్ని తగ్గించలేమని చేసిన కేంద్రం వాదన.. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొంది. ఆరు నెలల్లోగా దేశవ్యాప్తంగా 175 వాయు నాణ్యత పరిశీలన కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • టీకా ఉత్పత్తిపై భారత్​తో రష్యా సంప్రదింపులు
    రష్యా కరోనా టీకా 'స్పుత్నిక్-వి'ని ఉత్పత్తి చేసేందుకు సహకారాన్ని కోరుతూ ఆ దేశ రాయబారి భారత అధికారులను సంప్రదించారు. ప్రధాన శాస్త్రీయ సలహాదారు విజయ్ రాఘవన్, వైద్య పరిశోధన కార్యదర్శి బలరాం భార్గవ, జీవ సాంకేతిక శాఖ కార్యదర్శి రాణు స్వరూప్​ను కలిసి చర్చించినట్లు అధికారులు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • పాంటింగ్​తో అశ్విన్​ చర్చలు .. ఎందుకోసమంటే?
    క్రికెట్​లో మన్కడింగ్​ పద్దతిపై ప్రస్తుతం జోరుగా చర్చ నడుస్తోంది. ఈ క్రమంలోనే దిల్లీ క్యాపిటల్స్​ కోచ్​ రికీ పాంటింగ్​తో చర్చలు జరిపినట్లు జట్టు బౌలర్​ అశ్విన్​ తెలిపాడు. వచ్చే వారం వివరాలను వెల్లడిస్తానని తెలిపాడు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • మాజీలూ జాగ్రత్త.. యూట్యూబ్‌ జోలికి పోవొద్దు!
    పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు యూట్యూబ్‌ ఛానళ్లు నడపకుండా పీసీబీ నిషేధం విధించిందని సమాచారం. దేశవాళీ క్రికెట్‌తో అనుబంధం ఉన్నవాళ్లు తమ అభిప్రాయాలను యూట్యూబ్‌ ద్వారా వెల్లడించకూడదని ఆదేశించినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • అనసూయ ప్రేమపై ఇంట్లో వాళ్ల స్పందనేంటి!
    తన అందం, వాక్చాతుర్యంతో బుల్లితెరపై యాంకర్​గా రాణించి నటిగానూ గుర్తింపు పొందింది అనసూయ. తాజాగా 'ఆలీతో సరదాగా' షోలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ తన ప్రేమ, పెళ్లి గురించి చెప్పుకొచ్చింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.