వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ప్రజావ్యతిరేక విధానాలు అధికమయ్యాయని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్(TNSF state president Pranav Gopal) ధ్వజమెత్తారు. జీవో 77ను రద్దు చేయాలని సీఎం జగన్కు వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తున్న టీఎన్ఎస్ఎఫ్ నాయకులను అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు.
పాదయాత్రలో 2.3 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న జగన్... అధికారంలోకి రాగానే కేవలం పది వేల ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చారని ప్రణవ్ గోపాల్ దుయ్యబట్టారు. జగన్కు నిరుద్యోగులతో మాట్లాడే సమయం లేకపోడం బాధాకరమని ఆక్షేపించారు. చంద్రబాబు, లోకేష్, అచ్చెన్నాయుడుల ఆదేశాల మేరకు టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీని ఎంపిక చేశామన్నారు. టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా 15 మందిని, ప్రధాన కార్యదర్శులుగా 12 మందిని , అధికార ప్రతినిధులుగా 19 మందిని, కార్యనిర్వాహక కార్యదర్శులుగా 31 మందిని, సెక్రటరీలుగా 35 మందిని, మీడియా కోఆర్డినేటర్లుగా నలుగురిని, సోషల్ మీడియా కో ఆర్డినేటర్లుగా ఆరుగురిని ఎంపిక చేశామని వివరించారు. ఎంపికైనవారు ప్రభుత్వ వ్యతిరేక విధానాల పట్ల మరింత పోరాటం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి