విజయవాడ నగర శివారులోని కండ్రిక-పాతపాడు రహదారిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కండ్రిక ప్రాంతం నుండి పాతపాడు గ్రామానికి వెళ్లే రహదారిలో నూతనంగా నిర్మిస్తున్న ఆరు లైన్ల జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా ఏర్పాటు చేసిన జాకీలను పల్సర్ బైక్ ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించాడు.
మృతులు విజయవాడ వాంబేకాలనికి చెందిన వారుగా గుర్తించారు. అతి వేగంగా రహదారి డైవర్షన్ చూసుకోకుండా ద్విచక్రవాహనాన్ని నడపటం వల్లనే ఈ ప్రమాదం జరినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. దీనిపై నున్న గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:
ఆ 6 కిలోల బంగారాన్ని అటెండరే కొట్టేశాడు.. బాపట్ల బ్యాంకు చోరీ కేసులో షాకింగ్ నిజాలు