తెలంగాణ రాష్ట్రంలో కరోనా పంజా విసురుతున్న నేపథ్యంలో... ఈసారి హైదరాబాద్ బాలాపూర్ గణనాథుడి ప్రతిమను 6 అడుగులకు కుదిస్తున్నట్లు ఉత్సవ కమిటీ పేర్కొంది. ప్రతి సంవత్సరం నిర్వహించే లడ్డు వేలం ఈసారి నిర్వహించడం లేదని తెలిపింది. మొదటి పూజ కేవలం కమిటీ ఆధ్వర్యంలో జరుగుతుందని స్పష్టం చేసింది.
భక్తుల పూజలు... దర్శనాలకు అనుమతులు లేవని వివరించింది. ప్రతి సంవత్సరం జరిగే గణేశ్ శోభా యాత్ర ప్రభుత్వ అనుమతులు మేరకు అప్పటి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని ఉత్సవ కమిటీ ప్రకటించింది. భక్తులందరూ గణేశ్ నవరాత్రి ఉత్సవాలకు సహకరించాల్సిందిగా ఉత్సవ సమితి కమిటీ కోరింది.