thieves stolen bikes: తెదేపా ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో దొంగలు చేతి వాటం ప్రదర్శించారు. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆధ్వర్యంలో చేపట్టిన బైక్ ర్యాలీలో కార్యకర్తలు వేలాదిగా పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం పార్టీ కార్యాలయం వద్ద పార్క్ చేసిన పలు బైకులను దొంగలు మాయం చేశారు. వెంటనే స్పందించిన కార్యాలయ సిబ్బంది నాలుగు ద్విచక్రవాహనాలు చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: తితిదే క్వార్టర్స్‌లో అసాంఘిక కార్యకలాపాలు..!