ETV Bharat / city

విజయవాడ బస్టాండ్​లో దొంగల చేతివాటం

author img

By

Published : Dec 24, 2020, 12:10 PM IST

విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్​లో దొంగలు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. పర్సులు, చెవి కమ్మలు పోగొట్టుకున్న ప్రయాణికులు బస్టాండ్​లోని పోలీసు అవుట్ ఫిర్యాదు చేసినా.. పట్టించుకోకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గడచిన కొద్ది రోజులుగా జరుగుతున్న చోరీల దృష్ట్యా, భద్రతా చర్యలు పెంచాలని అధికారులను కోరారు. దొంగతనాల దృష్ట్యా బస్టాండ్​లో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆర్టీసీ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.

Thefts at Vijayawada Pandit Nehru Bus Stand
విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్​లో దొంగల చేతివాటం

విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్​లో దొంగలు చేతివాటం ప్రదర్శిస్తుండడంతో, ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఐదుగురి పర్సుల నుంచి రూ. 12 వేలకు పైగా నగదు, ఓ ప్రయాణికురాలు తన కూతురి కోసం కొన్న బంగారు చెవి దిద్దులు, అలాగే బీమవరం డిపోకు చెందిన బస్సు డ్రైవర్ టిమ్ మిషన్​ను దొంగిలించారు. బస్టాండ్​లోని పోలీసు అవుట్ ఫిర్యాదు చేసినా.. పట్టించుకోలేదని, ఫలితంగా కృష్ణలంక పోలీస్​ స్టేషన్​కు వెళ్లమని.. ఉచిత సలహా ఇచ్చారని కొందరు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

అధికారుల తీరుతో విసిగిపోయిన ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు వెళ్లిపోయినప్పటికీ.. టిమ్ చోరీపై బస్​ డ్రైవర్ కృష్ణలంక పీఎస్​ లో ఫిర్యాదు చేశాడు. ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గడచిన కొద్ది రోజులుగా బ్యాగులు,సెల్ ఫోన్లు చోరీలు జరుగుతుండడంతో భద్రతా చర్యలు పెంచాలని ప్రయాణికులు.. అధికారులను కోరారు. దొంగతనాల దృష్ట్యా బస్టాండ్​లో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆర్టీసీ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.

ఇదీ చదవండి:

ఆన్‌లైన్ రుణ వేధింపులపై పోలీసులను ఆశ్రయించిన మహిళ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.