ETV Bharat / city

బెజవాడ గ్యాంగ్ వార్: పోలీసుల అదుపులో సందీప్ గ్యాంగ్ - విజయవాడ తాజా వార్తలు

బెజవాడను వణికించిన గ్యాంగ్ వార్ ఘటనపై పోలీసుల దర్యాప్తు తుది దశకు చేరుకున్నట్లు సమాచారం. ఇప్పటికే మణికంఠ ముఠాలో కీలక నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. సందీప్ ముఠాకు చెందిన 10 మందికి పైగా కీలక నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నగరంలో గ్యాంగ్​లపై పూర్తిస్థాయి నిఘా కొనసాగిస్తామని ఉన్నతాధికారులు చెపుతున్నారు.

Vijayawada Gangwar case
బెజవాడ గ్యాంగ్ వార్
author img

By

Published : Jun 7, 2020, 7:15 PM IST

విజయవాడ నగరాన్ని వణికిస్తున్న గ్యాంగ్ వార్ ఘటన కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. పరారీలో ఉన్న సందీప్ ముఠా సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుమారు పది మందికి పైగా ఆ ముఠాలో కీలకంగా వ్యవహరించిన నిందితులను పోలీసులు విచారిస్తున్నారు. మణికంఠ గ్యాంగ్​లో అధికంగా బ్లేడ్ బ్యాచ్, గంజాయి సేవించే వారు ఉన్నారు. మంగళగిరికి చెందిన గ్యాంగ్ సభ్యులు సైతం ఈ దాడిలో పాల్గొన్నారని ఇప్పటికే పోలీసులు గుర్తించారు. మద్యం మత్తు .. విలాస వంతమైన జీవితమే వీరి లక్ష్యమని పోలీసులు చెబుతున్నారు.

రేపు మీడియా ముందుకు సందీప్ గ్యాంగ్...!

మణికంఠ గ్యాంగ్ సభ్యులను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. రేపు సందీప్ ముఠాలో కీలకంగా ఉన్న వారిని మీడియా ముందు హాజరుపరచునున్నట్లు సమాచారం. వీరిపై కేసు నమోదు చేయటమే కాకుండా ...భవిష్యత్​లో నగర బహిష్కరణ విధించేందుకు పోలీసు ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. నిందితులు సెటిల్ మెంట్​కు వెళ్లేటప్పుడు దర్జాగా నల్ల రంగు అద్దాలు ఉన్న కార్లలో బడాబాబుల్లా వెళతారని...., మరికొంతమంది వివిధ రకాల స్టిక్కర్లను వాహనాలకు అతికించుకుని వెళుతున్నారని గుర్తించారు. దీంతో నగరంలో గ్యాంగ్​లపై పూర్తి స్థాయి సమాచారం సేకరిస్తున్నారు. నగరంలో వాహనాలపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. నల్లరంగు అద్దాలు ఉన్న నాలుగు చక్రాల వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు.

ప్రస్తుత పోలీసుల రికార్డుల ప్రకారం 418 మందిపై రౌడీషీట్లు నమోదైనట్లు చెపుతున్నారు. వీరందరిపై టాస్క్ ఫోర్స్ పోలీసులు నిఘా ఉంటుంది. అయితే కొంతమందిపై రౌడీషీట్ చాలా ఏళ్ల నుంచి కొనసాగిస్తూ వస్తున్నారు. మరికొంతమంది గొడవల్లో పాల్గొంటున్నా కేసుల నుంచి తప్పించుకుంటున్నట్లు ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది. దీనిపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. క్షేత్రస్థాయి నుంచి సమాచారం రాబడుతున్నారు. బ్లేడ్, గంజాయి బ్యాచ్​లే కాకుండా ఎవరెవరు ఏయే ప్రాంతాల్లో బెదిరింపులకు పాల్పడుతున్నారో వివరాలు సేకరిస్తున్నారు. రౌడీయిజాన్ని అరికడతామని పోలీసులు చెపుతున్నారు.

ఇవీ చదవండి: విజయవాడ గ్యాంగ్ వార్: పండు రేపు డిశ్చార్జ్ అవుతున్నాడా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.