ETV Bharat / city

లోపాలు సరిదిద్దుకుందాం.... యువశక్తితో కదులుదాం... - తెదేపా మహానాడు వార్తలు

మహానాడులో రెండోరోజు కాస్త వాడీవేడిగానే చర్చ సాగింది. పార్టీలోని లోటుపాట్లపై కొందరు నేతలు నిర్మొహమాటంగానే ఎత్తిచూపారు. నేతల తప్పిదాలు, అనుసరిస్తున్న విధానాలపై బహిరంగంగానే అధినేత దృష్టికి తీసుకొచ్చారు. ఒకరి వాదనను మరొకరు తప్పుబడుతున్నారా అన్న రీతిలో నేతల ప్రసంగాలు సాగాయి. కష్టకాలంలో పార్టీని వదిలిపోయి.. అధికారంలోకి వచ్చినప్పుడు తిరిగొచ్చే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ చేర్చుకోబోమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు.

The second day in Mahanadu was a bit of a debate
మహానాడు రెండో రోజు
author img

By

Published : May 29, 2020, 7:26 AM IST

పార్టీని వేదికగా వినియోగించుకుని కష్టకాలంలో వదిలి వెళ్లి పోయేవారిని తిరిగిరానిచ్చేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో కష్టపడ్డాం.. కార్యకర్తలకు సరైన సమయం కేటాయించలేకపోయానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మహానాడు రెండో రోజున ‘తెలుగుదేశం- సంస్థాగత నిర్మాణం’ అనే అంశంపై మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప తీర్మానం ప్రవేశపెట్టగా.. పార్టీ నేతలు జ్యోతుల నెహ్రూ, గౌతు శిరీష, సోమిశెట్టి వెంకటేశ్వర్లు బలపరిచారు.

మహానాడు రెండో రోజు

ఎమ్మెల్యేల రాజ్యం: చినరాజప్ప

తెదేపా అధికారంలో ఉన్న సమయంలో.. ఒక్కో నియోజకవర్గం ఒక్కో ఎమ్మెల్యే రాజ్యంగా తయారైంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేసిన అభివృద్ధి, ఎమ్మెల్యేలు చేసిన అభివృద్ధిని ప్రజలకు చెప్పలేకపోయాం. ఎమ్మెల్యేలు పట్టించుకోకపోవడంతో కార్యకర్తల్లో అసంతృప్తి పెరిగింది. ఎన్నికల్లో వారు మౌనంగా ఉండిపోవటంతో ఓటమిపాలయ్యాం. జగన్‌ అందర్నీ నమ్మించేలా అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. పార్టీ తరపున గెలిచి వైకాపాలోకి వెళ్లిన గిరి, వంశీ, బలరామ్‌ ఎక్కడా కన్పించడం లేదు. అన్ని నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాలు ఎందుకు నిర్వహించలేకపోతున్నాం? అయిదేళ్లపాటు పదవులు అనుభవించిన నేతలు పార్టీ తరపున ఎంపీటీసీ, కౌన్సిలర్‌నైనా నిలబెట్టలేరా?

వాళ్లనే చేర్చుకుంటారని భయం: శిరీష

పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వచ్చి.. కష్టకాలంలో పోతున్నారు. అలాంటివారిని మళ్లీ చేర్చుకుంటారని భయపడుతున్నాం. ఈ విషయాన్ని ప్రస్తావించాలని సామాజిక మాధ్యమాల ద్వారా కొందరు నాకు సూచించారు. నాయకులు వస్తున్నారు, వెళ్తున్నారు. కష్టనష్టాలెదురైనా పార్టీకి అండగా ఉంటున్నది కేడర్‌ మాత్రమే. సరైన శిక్షణ ఇస్తే మంచి నాయకులు తయారవుతారు. తెలంగాణలో అధికారం సాగిస్తున్న నాయకులు తెలుగుదేశంలో శిక్షణ పొందిన వారే కదా.

మోదీతో మాట్లాడండి: జ్యోతుల నెహ్రూ

తూర్పుగోదావరి జిల్లా తెదేపా అధ్యక్షుడెవరో, జిల్లాలో ఏ కార్యక్రమం జరుగుతుందో కూడా తెలియడం లేదు. గత ప్రభుత్వంలో నిధులు తెచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. రూ.1,800 కోట్ల ఉపాధి నిధులు రావాల్సి ఉంది. కార్యకర్తలంతా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయారు. మీ (చంద్రబాబు) నాయకత్వం, సలహాలపై మోదీకి నమ్మకం ఉంది. మీరు మాట్లాడితే ఉపాధి బకాయిలు విడుదల చేయించుకోవచ్చు. నేనూ మీ మీద కోపగించి వెళ్లా. బయటకు వెళ్తేనే విలువ తెలిసి తిరిగొస్తారు. పార్టీలో యువతకు మరింత అవకాశం కల్పించాలి.

మేం వెనక్కి: సోమిశెట్టి వెంకటేశ్వర్లు

చాలామంది అధికారంలో ఉన్నప్పుడు పదవుల కోసం వస్తున్నారు.. అలాంటప్పుడు మేం వెనక్కిపోతున్నాం. కష్టకాలంలో బాగా పనిచేసినవాళ్లను, అంకితభావం ఉన్న కార్యకర్తలను మరిచిపోవద్దు. దొంగలను చేర్చుకోవద్దు. కార్యకర్తల్ని పోగొట్టుకోవద్దు. మీరు చెప్పినట్లు మేం నడుస్తాం.

రెండోరోజు తీర్మానాల్లో ఎమ్మెల్యేలు అనగాని సత్యప్రసాద్, పయ్యావుల కేశవ్ పాల్గొనకపోవడం చర్చనీయాంశమైంది. పర్చూర్ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరాలు ఆన్‌లైన్‌లో మహానాడులో పాల్గొన్నారా లేదా అనే దానిపై విస్తృత చర్చ జరిగింది.

ఇవీ చదవండి: ఆన్​లైన్​ 'మహానాడు' విజయవంతం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.