ETV Bharat / city

వరదొస్తే వారికి భయం.. గేట్లెత్తితే జీవితాలు నరకం - విజయవాడలో కృష్ణానది తీరప్రాంత ప్రజల కష్టాలపై కథనం

వరదొస్తుందంటే చాలు.... ఆ ప్రాంత వాసుల గుండెల్లో అలజడి మొదలవుతుంది. బ్యారేజీ గేట్లెత్తారంటే రేయీ, పగలూ తేడా లేదు. తట్టా బుట్టా సర్దుకోవాల్సిందే. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు పరుగులు పెట్టాల్సిందే. పైసాపైసా కూడబెట్టి కొన్న వస్తువులు, తిండి గింజలు తడవకుండా వారు పడే కష్టం చెప్పనలవికాదు. పీకల్లోతు నీళ్లొచ్చినా, విషసర్పాలు స్వైర విహారం చేస్తున్నా ప్రాణాలు పణంగా పెట్టి వాటిని రక్షించుకుంటారు. ఏటా ఓసారి ఇలా అనుకుంటే పొరపాటే.. గేట్లెత్తిన ప్రతిసారీ ఇవే పాట్లు. తమ కష్టాలు తీర్చాలని వారు మొక్కని దేవుడు లేదు. తీరం వెంట రక్షణ గోడ కట్టి ప్రాణాలు కాపాడాలని వేడుకుంటున్నా ఎవరూ పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకూ ఏమిటా పోరాటం.. ఎవరివీ ఈ కష్టాలు.. తెలుసుకోవాలంటే విజయవాడ నగరంలోని కృష్ణా తీర ప్రాంతానికి వెళ్లాల్సిందే.

The people of the coastal region of Krishna are in trouble due to floods
వారి జీవనం: వరదొస్తే భయం.. గేట్లెత్తితే నరకం
author img

By

Published : Oct 15, 2020, 2:08 PM IST

విజయవాడ నగరంలోని రాణిగారితోట, కృష్ణలంక, తారకరామనగర్, గీతానగర్, రణదీవెనగర్ తదితర ప్రాంతాల్లో కృష్ణానది తీరంలో వేలమంది నివాసముంటారు. ప్రకాశం బ్యారేజీ దిగువన కరకట్టను ఆనుకుని ఏర్పాటు చేసుకున్న రేకుల షెడ్లే వీరి నివాసాలు. నగరంలో కూలీనాలి చేసుకోవడం, రోడ్ల పక్కన చిరు వ్యాపారాలు చేసుకుని జీవనం సాగించే బడుగు జీవులు వీరంతా. ఎన్నో ఏళ్ల క్రితమే నదీ తీరంలో గూడు ఏర్పాటు చేసుకున్నారు. తాత్కాలికంగా పాకలు, రేకుల షెడ్లు వేసుకుని 50 ఏళ్లుగా ఇక్కడే జీవనం సాగిస్తున్నారు. అందరిలా సౌకర్యాలు లేకున్నా ఏదోలా బతుకు బండిని నెట్టుకొస్తున్నారు.

వరదొస్తే అవస్థే

అయితే వేసవి కాలం, చలికాలంలో ప్రశాంతంగా జీవనం గడిపే వీరికి.. వానాకాలం వచ్చిందంటే చాలు కష్టాలు చుట్టుముడతాయి. విష సర్పాలతో సావాసం వీరికి సర్వ సాధారణమవుతుంది. కృష్ణానదికి వరద వస్తుందంటే చాలు వీరి గుండెల్లో దడ మొదలవుతుంది. ఎప్పుడు బ్యారేజీ గేట్లెత్తుతారో.. ఎప్పుడు తమ గూడు గల్లంతవుతుందోనన్న దిగులుతో నిద్రలేని రాత్రులెన్నో గడుపుతారు. ఇళ్లలోకి నీరు రాగానే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వేగంగా సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలి. లేదంటే నీటితోపాటు వచ్చే విష సర్పాల బారినపడాల్సిందే. లేదా నీటి ఉద్ధృతిలో ప్రాణాలు కోల్పోవాల్సిందే. కృష్ణమ్మ ఉప్పొంగిన ప్రతిసారి వీరికి వరద కష్టాలు షరా మామూలే. ఎక్కడో ఓ చోట తలదాచుకుని పిల్లా పాపలను రక్షించుకోవడం, వరద తగ్గాక మళ్లీ గూటికి రావడం, శుభ్రం చేసుకుని మళ్లీ జీవనం గడపటం పరిపాటే..

ఈ ఏడాది పెరిగిన కష్టాలు

గతంతో పోల్చితే ఈ ఏడాది పరిస్థితి భిన్నంగా ఉంది. ఈ సంవత్సరం నెలల తరబడి వరద ఉద్దృతి కొనసాగడమే దీనికి ప్రధాన కారణం. ప్రకాశం బ్యారేజీ గేట్ల నుంచి ఉరకలెత్తుతూ దిగువకు వస్తోన్న కృష్ణమ్మ తరచూ ముంచెత్తుతోంది. దీంతో వీరు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. గతంలో 2, 3 రోజులకు వరద తగ్గేది. దీంతో తిరిగి ఇళ్లకు చేరుకునేవారమని.. ఈసారి ఆ పరిస్థితి లేదంటున్నారు. గతేడాది కృష్ణానదిలో 2 నెలలకు పైగా వరద కొనసాగింది. ఈసారది మరింత పెరిగింది. ఇప్పటికే 10 సార్లకు పైగా బ్యారేజీ గేట్లెత్తారు. నెలల తరబడి తాము పునరావాస కేంద్రాల్లో తలదాచుకోవాల్సిన దుస్ధితి వస్తోందని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తున్న పరిస్ధితుల్లో ఇలా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయంభయంగా కాలం వెల్లదీస్తున్నామని వాపోతున్నారు.

రక్షణ గోడే రక్ష

నదీ తీరం వెంట రక్షణ గోడ నిర్మించి తమ ఇళ్లు మునగకుండా రక్షించాలన్నదే ఈ ప్రాంత వాసుల చిరకాల కోరిక . దీనికోసం దశాబ్దాలుగా వారు చేయని పోరాటం లేదు. గత ప్రభుత్వంలో ఎట్టకేలకు వీరి పోరాటం ప్రతిఫలం లభించింది. ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువన 5 కిలోమీటర్ల వరకు రక్షణ గోడ నిర్మించేందుకు గత ప్రభుత్వం రూ. 550 కోట్ల నిధులు మంజూరు చేసింది. ముంపు తీవ్రత ఎక్కువగా ఉండే కృష్ణలంక, రామలింగేశ్వర నగర్ ప్రాంతాల్లో 2.5 కిలోమీటర్లు తొలిదశలో నిర్మాణం చేపట్టారు. పనులు చేపట్టిన నిర్మాణ సంస్ధ 6 నెలల్లోపే 2.5 రెండున్నర కిలోమీటర్ల రక్షణ గోడ నిర్మాణం పూర్తి చేసింది. దీంతో రామలింగేశ్వర నగర్ వద్ద 2 కిలో మీటర్లకు పైగా నిలువెత్తు గోడ రక్షణ కవచంగా నిలిచి ఆ ప్రాంత వాసులను రక్షిస్తోంది. ఇక శరవేగంగా గోడ నిర్మాణం పూర్తై ఈ ఏడాది తమ ప్రాంతాన్నీ వరద నుంచి కాపాడుతుందని మిగిలిన ప్రాంత వాసులు తలచారు. అయితే ఎన్నికలు రావటంతో గోడ నిర్మాణం ఆగిపోయింది. అధికారంలోకి వచ్చిన ప్రస్తుత సర్కారు సమీక్షల పేరిట గోడ నిర్మాణాన్ని కొనసాగించలేదు. ఏడాదిన్నర గడిచినా పనులెప్పుడు మొదలు పెడతారో అంతుచిక్కని పరిస్ధితి ఏర్పడిందంటున్నారు అక్కడి వాసులు.

గోడ నిర్మాణంతో తమకు భరోసా వస్తుందనుకున్న సమయంలో ఇలా నిర్మాణం ఆగిపోవడం అక్కడి ప్రజలను వేధిస్తోంది. వరద వచ్చిన ప్రతిసారి ప్రజాప్రతినిథులను కలిసి గోడ నిర్మించాలని వేడుకోవడం వీరికి అలవాటైంది. అయినా పనులు కావడంలేదు. పునరావాసం కోసం ఏటా కోట్లు ఖర్చు పెట్టే ప్రభుత్వం.. గోడ నిర్మాణం పూర్తిచేసి తమను కాపాడాలని వేడుకుంటున్నారు.

ఇవీ చదవండి..

కరోనా ఎఫెక్ట్: దయచేసి వినండి... మాస్క్ ధరించండి...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.